జోరు పెంచేసిన ఇస్మార్ట్ హీరోయిన్.. !

NAGARJUNA NAKKA

స్టార్ తిరగడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు. సిట్యువేషన్ ని వాడుకుంటే చాలు గ్రాఫ్ పీక్స్ కు చేరుతుందని ప్రూవ్ చేస్తోంది నభా నటేశ్. యంగ్ హీరోల పరిస్థితులను వాడుకుంటూ... బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటోంది. కుర్ర హీరోలను మాయ చేస్తూ.. కెరీర్ ను మరో స్టేజ్ కు తీసుకెళ్తోంది నభా నటేశ్. 

 

ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేశ్ జోరు చూసి మిగతా హీరోయిన్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంత తక్కువ టైమ్ లో అన్ని అవకాశాలు ఎలా అందుకోగలుగుతోందని డిస్కషన్లు పెడుతున్నారు. రీసెంట్ గా నితిన్ అంధాదున్ రీమేక్ లో నభాని హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం రావడంతో బాలీవుడ్ బ్యూటీస్ లో చిన్న పాటి ఆలోచన మొదలైంది. మేము స్లో అవుతోంటే.. నభా ఎలా బిజీ ఎలా అవ్వగలుగుతోందని థింకింగ్స్ చేస్తున్నారు. 

 

బాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోస్ కు సరైన హీరోయిన్లు దొరకడం లేదు. లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్లు మునుపటిలా మేజిక్ చేయలేకపోతున్నాడు. పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి స్టార్ హీరోయిన్లు కుర్రాళ్లతో స్టెప్పులేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. దీంతో చిన్నపాటి వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఈ సిట్యుయేషన్ నే కరెక్ట్ గా వాడుకుంటోంది నభా నటేశ్. 

 

నభా నటేశ్ ఇస్మార్ట్ శంకర్ తో అందరినీ మాయ చేసింది. కొంచెం బోల్డ్ మరికొంచెం నాటి క్యారెక్టర్ తో కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యింది. దీంతో యంగ్ హీరోలు నభా నటేశ్ ని బెస్ట్ ఆప్షన్ గా చూస్తున్నారు. అందుకే వరుస అవకాశాలు అందుకుంటోంది నభా. ఈ బ్యూటీ ప్రస్తుతం సాయి తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్, బెల్లం కొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలు చేస్తోంది. వీటితో పాటు రవితేజతోనూ ఓ మూవీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. సో ఈ లిస్ట్ చూస్తే నభా నటేశ్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతున్నట్టే కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: