`ఉప్పెన` హీరోయిన్ కృతి శెట్టి అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!!
సాధారణంగా తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు పరిచయమవుతూనే ఉంటారు. అందులో అందం, అభినయంతో పాటు అదృష్టం కలిసొచ్చిన వారు టాప్ రేంజ్లో దూసుకుపోతుంటారు. కానీ, తొలి సినిమా విడుదల కాకుండానే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఈ లిస్ట్‌లో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. మెగా కాంపౌండ్ నుంచి వస్తోన్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. ‘ఉప్పెన’ సినిమా ద్వారా ఈయన వెండితెరకు పరిచయమవుతున్నారు. బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేసారు. నీ కళ్ళు నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో వైష్ణవ్ తేజ్ కూడా బాగానే ఆకట్టుకున్నా కానీ హీరోయిన్ కృతి శెట్టి మాత్రం ప్రేక్షకులకు ఫేవరేట్ అయిపొయింది.
ముఖ్యంగా ఆమె నవ్వు యువకులను కట్టిపడేస్తోంది. చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేస్తున్న ఈ అమ్మడు ఉప్పెన సినిమాతో హిట్ కొడితే.. ఖచ్చితంగా యువ హీరోల జోడీగా ఆమె జోరు కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. తొలి సినిమా కూడా విడుదల కాకుండానే కృతి శెట్టి మరో రెండు సినిమాలకు సైన్ చేయడం విశేషం.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కృతి శెట్టి క్యూట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి ఎవ్వరైనా ఫిదా అవ్వల్సిందే అన్న చందంగా కృతి శెట్టి ఫోటోలు ఉన్నాయి. మరి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.