సారీ సుశాంత్.. అలా చేయను.. భావోద్వేగంతో డైరెక్టర్ కరణ్ జొహార్!

Edari Rama Krishna

బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. గత నెలలో ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ కన్నుమూశారు.. ఆ తర్వాత ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నమూశారు. ఇలా బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచి వేసింది. 

 

బాలీవుడ్ సెలబ్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్, కోలీవుడ్, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు తమ శ్రద్దాంజలి తెలిపారు. తాజాగా గత కొంతకాలంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో తాను టచ్ లో లేనని, ఇది తనకెంతో బాధను కలిగిస్తోందని బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జొహార్ భావోద్వేగ పోస్టు పెట్టాడు. ఆయన మరణం తనకు ఓ పెద్ద మేలు కొలుపని అభివర్ణించాడు. అతనికి ఓ స్నేహితుడు అవసరమన్న సంగతిని గుర్తించానని, అంతకన్నా లోతుగా వెళ్లలేకపోయినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నానని, ఇకపై తన జీవితంలో ఎన్నడూ ఇలా చేయబోనని అన్నారు.

 

సుశాంత్ వి కల్మషం లేని నవ్వులని, ఆయన ఆత్మీయ ఆలింగనాలను తాను ఇప్పుడు కోల్పోయానని అన్నారు. కాగా, కరణ్ నిర్మించిన 'డ్రైవ్'లో సుశాంత్ నటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టిన కరణ్ జొహార్, తనను తాను నిందించుకున్నారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I blame myself for not being in touch with you for the past year..... I have felt at times like you may have needed {{RelevantDataTitle}}