సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

Kavya Nekkanti

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఇకలేర‌న్న విష‌యం తెలిసిందే. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. డిప్రెషన్‌తో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులోనూ సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన‌ట్టు తేలింది. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. అయితే వర్ధమాన హీరోగా ఎదుగుతున్న క్రమంలో సుశాంత్ సూసైడ్ చేసుకోడానికి కారణమేంటి? అన్న‌ది మిస్ట‌రీగా ఉండిపోయింది. 

ఇక ఆయన మృతి చెందిన ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో... ఎందుకు సూసైడ్ చేసుకున్నాడనేది అంతుపట్టని విషయంగా మారిపోయింది. ప్ర‌స్తుతం దానిపైనే పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. టీవీ సీరియల్స్ ద్వారా నట ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశాంత్ సింగ్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్.. ‘ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో దేశ‌వ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఎదిగాడు. య‌రోవైపు ఈయ‌న‌కు ఆస్తులు కూడా భారీగా ఉన్నాయి. సుశాంత్ ఒక సినిమాకు దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు తీసుకుంటారు. అడ్వర్టైజ్‌మెంట్లకు చేయడానికి రూ.కోటి వరకు తీసుకుంటారు. 

ఇలా సుశాంగ్ సింగ్ ఆస్తుల‌ విలువ దాదాపు రూ.60 కోట్ల వరకు ఉండొచ్చ‌ని తెలుస్తోంది. అంతేకాదు, సుశాంత్ సింగ్‌కు చాలా కార్లు, బైకులు కూడా ఉన్నాయి. ల్యాండ్ రోవర్, మాసెరటి క్వార్టర్‌పోర్ట్, బీఎండబ్ల్యూ 1300ఆర్ బైక్ సహా పలు ఇతర కార్లు కూడా ఉన్నాయ‌ట‌. ఇక సీ ఆఫ్ మాస్కోవీలో ఈయన ప్లాట్ ఉంది. అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంతరిక్షానికి సంబంధించిన విశేషాలను చిన్నారులను తెలిపాలనే కోరిక ఆయనకు బలంగా ఉండేద‌ట‌. ఈ క్రమంలోనే చంద్రుడిపైన ప్లాట్ కూడా‌ కొనుగోలు చేయ‌డం విశేషం. మ‌రోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... బాంద్రాలో ఉంటున్న ఇంటి అద్దె నెలకు రూ. 4, 50, 000. అడ్వాన్స్‌గా రూ. 13 లక్షలు డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: