సినిమా పబ్లిసిటీకి మోడీని వాడుకుంటున్న హీరో !

Seetha Sailaja
ప్రస్తుతం టాలీవుడ్ కు మోడీ ఫీవర్ విపరీతంగ సోకింది. ప్రతిరోజు ఎవరో ఒకరు మోడీని కలవడం కోసం అహమ్మదాబాద్ బాట పడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాగార్జున లాంటి టాప్ స్టార్లు స్వయంగా గుజరాత్ వెళ్లి మెడీని కలిసారు. ఆయనే ప్రధాని కావాల్సిన అవసరం ఉందంటూ జై కొట్టి వచ్చారు.  ఇలాంటి పరిస్థుతులలో మరో టాలీవుడ్ హీరో కూడా మోడీని కలవబోతున్నాడు. అతనెవరో కాదు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఈ విషయాన్ని సంపూర్ణేష్ బాబు స్వయంగా వెల్లడించారు. మరో మూడు రోజుల్లో మోడీని కలవబోతున్నానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు.  అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. తన ‘హృదయ కాలేయం' చిత్రానికి పబ్లిసిటీ తేవడానికే సంపూర్ణేష్ బాబు నరేంద్రమోడీ పేరును వాడుకుంటున్నాడని అంటున్నారు. సంపూర్ణేష్ లాంటి వారికి మోడీ అపాయింట్ మెంట్ దొరికే అవకాశమే లేదు అని కూడ సంపూ బాబు పై సెటైర్లు వేస్తున్నారు. ఒక పక్క కొందరు టాప్ హీరోలు తమ ఆస్తులను కాపాడుకోవడానికి మోడీకి జై కొడుతూ ఉంటే సంపూ బాబు తన సినిమా పబ్లిసిటీ కోసం మోడీ పేరును వాడుకుంటున్నాడు. ఎదిఎమైనా మోడీ పేరు టాలీవుడ్ కు బాగానే కలిసి వస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: