బార్బర్ గా మారిన ‘ఆది పినిశెట్టి’ వీడియో వైరల్!
గత మూడు నెలలుగా దేశంలోకరోనా మహమ్మారి ప్రభావం ఏ రకంగా చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఫిబ్రవరి మాసంలో మొదలైన కరోనా కేసులు మార్చిలో పెరిగిపోతున్న తరుణంలో 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి సినీ పరిశ్రమ పూర్తిగా షట్ డౌన్ అయ్యింది. ఒక్క సినీ పరిశ్రమనే కాదు అన్నినిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాలు తప్ప అన్నీ మూసివేశారు. దాంతో సెలబ్రెటీలు ఇంటికే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి కొంత మంది కరోనాపై అవగాహన కల్పించేందుకు వీడియోలు చేస్తే.. కొంత మంది వ్యాయామాలు, జిమ్ లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొంత మంది బొమ్మలు వేయడం, వంటలు చేయడం ఇలా రక రకాల సోషల్ పోస్ట్ లు చేస్తూ వచ్చారు.
తెలుగు ఇండస్ట్రీలో రవిరాజా పినిశెట్టి ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, రచయిత. ఈయన తెలుగు, తమిళ భాషలలో ఇప్పటి వరకు దాదాపు 35 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తనయుడు ఆది పినిశెట్టి నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఎలాంటి పాత్రలకైనా రెడీ అంటున్న ఆది పినిశెట్టి తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ తండ్రీ కొడుకుల ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తండ్రికి హెయిర్ కట్ చేసి ..డబ్బులు బలవంతంగా లాక్కున్నాడు హీరో ఆది పినిశెట్టి. తాజాగా ఆది పినిశెట్టి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. నచ్చిన విధంగా హెయిర్‌కట్ చేయడంతో తండ్రి సంతోషంతో ఆదికి డబ్బులు ఇవ్వాలనుకున్నారు. ఆది సేవలకు మెచ్చి పక్కనే ఉన్న పర్సులోంచి రూ. 500 తీసి ఇచ్చాడు. ఇవి సరిపోవంటూ పర్సును లాక్కొని కోరుకున్నంత డబ్బును తీసుకునేందుకు ప్రయత్నించాడు. తండ్రి నుంచి పర్సు లాక్కునేటప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ చాలా బాగుంటుంది.
#Haircut timeeee!!
iam sure I need one more than my Dad😉#lockdownlife#staypositive pic.twitter.com/uUAOW2FDuo — Aadhi's (@AadhiOfficial) June 16, 2020