రామ్ గోపాల్ వర్మే అనుకుంటే ఇప్పుడు ఇంకొకరు..!

NAGARJUNA NAKKA

కరోనాతో ప్రపంచమంతా భయపడుతోంటే.. సినిమావాళ్లు మాత్రం ఈ కోవిడ్ ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు. పోటీలు పడి మరీ కరోనా సినిమాలు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మే అనుకుంటే అతనికి ఇప్పుడు అమీర్ తోడయ్యాడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కూడా కరోనా సినిమా చేయబోతున్నాడు. 

 

హాట్ టాపిక్స్ తో సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు. సెన్సేషనల్ న్యూస్ ని వెండి తెరకెక్కించడానికి తెగ ఆరాటపడుతుంటాడు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాని కూడా ఇలాగే తెరకెక్కిస్తున్నాడు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు. ఇక రామ్ గోపాల్ వర్మ నుంచి ఇలాంటి టైటిల్స్, ట్రైలర్లు రావడం జనాలకు చాలా కామన్ గా మారిపోయింది కాబట్టి.. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి అనౌన్స్ మెంట్ లు పెరిగిపోతున్నాయి. 

 

యూనిక్ స్టోరీస్ తో మెప్పించే అమీర్ ఖాన్ కూడా కరోనా సిినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇండియాను భయపెడుతోన్న కోవిడ్ ప్రభావాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట అమీర్ ఖాన్. అమెరికన్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దా సినిమా క్లైమాక్స్ లో కరోనా ఎపిసోడ్ ను చూపించబోతున్నారట. 

 

ఆ, కల్కి సినిమాలతో సందడి చేసిన ప్రశాంత్ వర్మ కూడా కరోనా సినిమా తీస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ, అమీర్ ఖాన్ కరోనా వైరస్ పై సినిమాలు చేస్తోంటే.. ఈ దర్శకుడు మాత్రం వ్యాక్సిన్ కథ సిద్ధం చేస్తున్నాడు. కరోనా వ్యాక్సిన్ అనే మూవీ ప్లాన్ చేశాడు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ. మొత్తానికి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ పై కూడా సినిమాలు చకచకా వచ్చేస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ఆస్పత్రి పాలైన జనం.. చిన్నచూపు చూసిన సమాజం.. బాధితులు పడిన ఇబ్బందులను కళ్లకు కట్టనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: