ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఫోన్ కాల్ సర్ ప్రైజ్..!

shami

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్ కు ఫోన్ చేయబోతున్నాడట. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసోషియేషన్ లో యాక్టివ్ మెంబర్స్ కొంతమందికి ప్రభాస్ నుండి ఫోన్ వస్తుందని తెలుస్తుంది. ఇంతకీ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎందుకు ఫోన్ చేయాలని అనుకుంటున్నాడు అంటే.. తన సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ప్రభాస్ 20 సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని ఫ్యాన్స్ దిగులు పడుతున్నారు. ఇంతవరకు కనీసం టైటిల్ ఏంటన్నది కూడా ఫైనల్ చేయలేదు. అందుకే ప్రభాస్ 20 చిత్ర దర్శక నిర్మాతల మీద ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 

 

మీడియాలో కూడా ప్రభాస్ 20వ సినిమా టైటిల్ గా ఒక్కోరోజు ఒక్కో పేరు వినిపిస్తుంది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ను శాంతపరచే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. తన ఫ్యాన్స్ లో ఇంపార్టెంట్ అనుకున్న వారందరికి ఫోన్ చేసి సినిమా అప్డేట్స్ గురించి కొద్దిగా ఓపిక పట్టమని చెబుతాడట. అంతేకాదు ఫ్యాన్స్ కు మాత్రమే స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని గుడ్ న్యూస్ కూడా వారికి చెబుతాడట. చాలాకలంగా బయటకు కనిపించని ప్రభాస్ ఈమధ్య గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొసం బయటకు వచ్చాడు.

 

ఈమధ్య ప్రభాస్ గెస్ట్ హౌజ్ గురించి కూడా రకరకాల వార్తలు వచ్చాయి. వాటి గురించి కూడా ప్రభాస్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. వీటన్నిటి గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తో డైరెక్ట్ ఫోన్ ఇంటరాక్షన్ చేస్తాడని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ప్రభాస్ 20వ సినిమాను జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది.                   
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: