నిహారికకు పెళ్లి కుదిరిందా?
మెగా డాటర్ నిహారిక... పెద్దగా విజయాలు సాధించలేక పోయినా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తారగా అభిమానులను కొంతమేరకు ఆకట్టుకుంది. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొంతమేరకు మంచి మార్కులు తెచ్చుకొని గుర్తింపు సాధించింది. అదేవిధంగా బుల్లితెర మీద కొన్ని షోలకు గెస్ట్ గాను మరికొన్ని షో లకు హోస్ట్ గాను నిర్వహిస్తూ అభిమానులను అలరిస్తుంది.
ఇప్పుడు చిత్రసీమలోని కాకుండా అభిమానులలో కూడా నిహారిక పెళ్లి ఇప్పుడు ఎవరితో అనే ప్రశ్న ఉంది. ఈ మధ్యన చాలా సార్లు చాలా రోజుల నుంచి నిహారిక పెళ్లి గురించి అటు సోషల్ మీడియాలోనూ ఇటు యూట్యూబ్లోనూ వైరల్ గా మారింది. ఈ మధ్యన మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి గురించి ఈ విధంగా స్పందించారు.
" అమ్మాయి నిహారికకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాం. సంబంధాలు చూస్తున్నాం. వచ్చే ఏడాదిలోనే ఆమెను ఒక ఇంటిదాన్ని చేయాలనే ఆలోచన ఉంది. ఆ తర్వాత మిగిలింది వరుణ్ తేజ్. ఈ పెళ్లైన తర్వాత మంచి అమ్మాయిని చూసి చేసే అవకాశం ఉంది. అయితే అది 2022లో చేయాలనే ఆలోచనా ఉంది. ఏ తండ్రికైనా తన బాధ్యతలను నెరవేర్చడం ముఖ్యం. అందరిలాగే నాక్కూడ అమ్మాయి నిహారికను వైద్యురాలిగా, అబ్బాయిని వరుణ్‌తేజ్‌ని ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలని ఓ కోరిక ఉండేది. కానీ తల్లితండ్రులు సాధించలేని కలలను తన వారసులపై రుద్ద కూడదనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది వారికి తెలిసి ఉంటుంది.
auto 12px; width: 50px;">View this post on InstagramUh.. what? A post shared by {{RelevantDataTitle}}