అతనితో కీర్తి ఐ లవ్ యూ ?
కీర్తి సురేష్ అంటే మహానటి. అందగత్తె కూడా. ఆమె ఇపుడు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఇక చేతిలో ఎన్ని ఆఫర్లు ఉన్నా కూడా తొందరపడి గబుక్కున ఏదీ ప్పుకోవడంలేదు. దీనికి ఒక కారణం ఆమె మహానటి క్రేజ్ ని దిగజార్చుకోకూడదని, ఆలా వచ్చిన పేరుని కాపాడుకోవాలని ప్రయత్నమని అంటారు.
మరో రెండవ కారణం కూడా ఉందిట. అది చాలా ఇంటెరెస్టింగ్ అంటున్నారు. అదే కీర్తి సురేష్ లవ్ లో పడడం. అవును నిజం. ఈ అందమైన హీరోయిన్ ప్రేమలో పడిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదే విషయం మీడియాలో వస్తే ప్రేమా లేదు, దోమా లేదు అంటూ కీర్తి గట్టిగానే ఖండించేసింది కానీ నిప్పు లేనిదే పొగ రాదు అంటున్నారు.
అంటే కీర్తి పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందని అంటున్నారు. ఆమె ప్రేమ ఎవరితోనో కాదుట. ఢిల్లీకి చెందిన ఒక బీజేపీ నేత కుమారుడితోనట. కీర్తి ఈ ప్రేమ విషయం దాచి ఉంచుతోంది అంటున్నారు. ఎందుకంటే ముందు సినిమాలు పూర్తి చేయాలన్నది కీర్తి ఆలోచనట. అందుకే సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తోందిట. . ఆమె అలా సినిమాలు పూర్తి చేయడం ఇలా కోరుకున్న ప్రియుడితో మూడు ముళ్ళూ వేయించుకోవడం ఒకేసారి అవుతాయి అంటున్నారు.
మొత్తానికి మహానటిలో సావిత్రి లా నటించిన కీర్తి నిజ జీవితంలో తాను కూడా ప్రేమలో పడిందని, అచ్చం ఆమెలాగనే లవర్ ని ఎంచుకుందని అంటున్నారు. మరి కీర్తి లేటేస్ట్ గా మహేష్ బాబు మూవీ సర్కార్ వారి పాటలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ మూవీ తరువాత కీర్తి ఈ గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి.