నా అనుమతి లేకుండా ఇలాంటి ఫోటోలు ఎందుకు వేశారు: కంగనా రనౌత్
ఓ ఫ్యాషన్ మ్యాగ్జైన్ సంస్థ, తన అనుమతి లేకుండా కంగన ఫొటోలు ఉపయోగిస్తోందని నటి కంగనా రనౌత్ బృందం ట్వీట్ చేసింది. ఇలా వినియోగించి సొమ్ము చేసుకోవడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటన ద్వారా ఈ నటి ప్రశ్నించింది. బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ ఐదేళ్ల క్రితం నిషేధించింది. అయితే నిషేధం ఉన్నప్పటికీ తన చిత్రాలను సదరు మ్యాగ్జైన్ లో ఉపయోగిస్తూ, వారు ప్రచారం చేసుకుంటున్నారని కంగనా రనౌత్ బృందం ట్వీట్ చేసింది.
.@VOGUEIndia has banned kangana, (her last cover with them was 5 years ago), because @Anaita_Adajania (their style editor & now fashion Director) is very close to karan johar, but is it fair for them to keep using her old videos to keep making money? https://t.co/Y1sTZY4z83 — Team kangana ranaut (@KanganaTeam) June 21, 2020
కంగన రనౌత్‌పై ఐదేళ్ల క్రితం వోగ్ ఇండియా నిషేధం విధించింది. ఎందుకంటే ఆ సంస్థకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అనైతా అడజానియా.. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కు సన్నిహితులు కావడమే ఇందుకు కారణం. కంగనపై నిషేధం విధించినప్పటికీ ఆమె ఫొటోలు, వీడియోలను ఇప్పటికీ ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుంటుందీ సదరు సంస్థ" అని కంగనా రనౌత్ టీమ్ ట్వీట్ చేసింది. " ఫ్యాషన్ " చిత్రం విడుదల సమయంలో తనను ఎంపిక చేశారని, ఆ తర్వాత ప్రియాంక చోప్రాతో ఫొటోషూట్ చేశారని చెప్పింది కంగనా. ప్రముఖ హీరోయిన్ల జాబితాలో లేకపోవడమే కారణమని అప్పుడు సంస్థ ప్రతినిధులు తనతో చెప్పినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
2014లో ఓ కవర్ ఫొటోషూట్ కోసం తనను సంప్రదించారని, కానీ తనకు స్టైలింగ్ చేసేందుకు డిజైనర్ అనైతా నిరాకరించిందని కంగనా చెప్పింది. అప్పుడు అనైతా తన సహాయకుడిని పంపిందని తెలిపింది. 'క్వీన్' సినిమా తర్వాత తరచుగా ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతూ, మ్యాగజైన్ కవర్ కోసం వారితో కలిసి పనిచేశానని కంగనా రనౌత్ చెప్పింది. అయితే ఫొటోషూట్ ల కోసం అనైతా డిజైనింగ్స్ అడగ్గా, ఆ సంస్థ సరిగా స్పందించకుండా తనతో విచిత్రంగా ప్రవర్తించారని తెలిపింది. అప్పటివరకు కేవలం వోగ్ తో రెండు కవర్ ఫొటోల కోసమే పనిచేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత నిషేధం ఎదుర్కొంటున్నా.. తన ఫొటోలు, వీడియోలను వినియోగించి సొమ్ము చేసుకోవడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.