సిక్స్ ప్యాక్ తో అదరగొట్టబోతున్న ధనుష్!
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. మామ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ ఏమాత్రం వాడకుండా తన టాలెంట్ తో మెప్పిస్తున్నాడు. రచయిత, సింగర్, డైరెక్టర్, నిర్మాత, నటుడిగా తన సత్తా చాటుతున్నాడు ధనుష్. మారి చిత్రంతో తెలుగు లో ఎంత క్రేజ్ సొంతం చేసుకున్నాడు అందరికీ తెలిసిందే. అప్పట్లో గతంలో ధనుష్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన విషయం తెల్సిందే. మారి 2 చిత్రం కోసం ఆయన చేసిన వర్కవుట్స్ వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. ఆ చిత్రం క్లైమ్యాక్స్లో ధనుష్ సిక్స్ప్యాక్స్తో ఫైట్ సీన్లో కనిపిస్తాడు.
మళ్లీ ఇప్పుడు ధనుష్ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించాడు అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనదైన సహజ నటనతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటున్నారు. ఆ మద్య ధనుష్ నటించిన ‘అసురన్’ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం కోసం మరోసారి సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నారట దనుష్. ఆ సిక్స్ప్యాక్స్ కోసం ధనుష్ ఎంత కష్టపడ్డాడో తెలియజేస్తూ అతని అభిమానులు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ 30 సెకన్ల వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.ప్రస్తుతం ధనుష్ చేతిలో నాన్ రుద్రన్ చిత్రంతో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. నాన్ రుద్రన్ చిత్రానికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ కరోనా నేపథ్యంలో షూటింగ్స్ మూసి వేసిన విషయం తెలిసిందే.