విజయ్ దళపతి కి స్పెషల్ గా విషెస్ చెప్పిన కీర్తి సురేష్  ...!

Suma Kallamadi

మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి చాలా స్పెషల్ గా బర్త్డే విషెస్ తెలియజేసింది. మాస్టర్ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరీ పాటకు ఆమె వయోలిన్ ప్లే చేస్తూ విజయ్ దళపతి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. దీనికి సంబంధించిన వీడియోను కీర్తి సురేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. " జీవితం చాలా చిన్నది అబ్బా ... ఎప్పుడు ఆనందంగా ఉండండి. హ్యాపీ బర్త్డే విజయ్ సార్, మీ బర్త్ డే రోజున ఓ చిన్న వీడియో " అని ఆ పోస్టుకు వీడియోను జతచేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

 

కీర్తి సురేష్ వయోలిన్ ప్లే చాలా బాగా చేసిందంటూ అనేకమంది నుండి ప్రశంసలు అందుకుంటోది మహానటి. ఇకపోతే హీరో విజయ్ కీర్తి సురేష్ జంటగా భైరవ, సర్కార్ సినిమాలలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా కీర్తి సురేష్ నటించిన చిత్రం పెంగ్విన్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. అయితే ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా స్పందన రాలేకపోయింది. అలాగే తాజాగా మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: