బన్నీ డిమాండ్ మామూలుగా లేదుగా ?

Satya

బన్నీ..అల్లు అర్జున్ కుమారుడుగా, మెగాస్టార్ చిరంజీవి మెనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ అతి తక్కువ టైంలోనే బన్నీ స్టార్ డం సంపాదించారు. ఇపుడు బన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్ తో రెచ్చిపోతున్నారు. లేటెస్ట్ హిట్ అల వైకుంఠపురంలో మూవీతో బన్నీ ఇపుడు టాలీవుడ్లో నంబర్ వన్ కే గురి పెట్టాడు. ఇక్ బన్నీ  పుష్ప మూవీ చేస్తున్నాడు.

ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీగా ఉంది. ఈ మూవీ బన్నీ రేంజిని డబుల్ చేస్తుందని అంటున్నారు. ఈ మూవీలో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే  లారీ డ్రైవర్ గా యాక్ట్ చేస్తున్న సంగతి విధితమే. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారని అంటున్నారు.

సౌత్ లో ఇప్పటికే బన్నీకి కోలీవుడ్, మాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఉత్తరాన కూడా ఊపేయాలని బన్నీ డిసైడ్ అయ్యాడట. ఈ మూవీ కోసం బన్నీ మేకోవర్  చాలా రఫ్ గా ఉంది. బన్నీ మొత్తం పాత్రలో లీనమైపోయాడు. ఇక బన్నీ ఈ మూవీకి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు.

అలవైకుంఠపురం మూవీకి పాతిక కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న బనీ ఈ మూవీకి ఏకంగా 35 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆ మొత్తం ఉండాల్సిందేనని బన్నీ అంటున్నాడుట. అయితే ఈ మూవీ భారీ బడ్జెట్ కావడంతో పాటు, పాన్ ఇండియా మూవీ అవడం, ఇక కరోనా ప్రభవంతో థియేటర్లకు జనం ఎలా వస్తారో. థియేట్రికల్ రైట్స్ మీద ఎంత మొత్తం వస్తుందో తెలియక నిర్మాతలు సతమవుతున్నారు. కానీ బన్నీ మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి బన్నీ రేంజి ఏ లెవెల్లో ఉంటుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: