వైరల్ అవుతున్న దిల్ రాజు మనవరాలి అన్నప్రాసన వేడుక ఫోటోలు..!

frame వైరల్ అవుతున్న దిల్ రాజు మనవరాలి అన్నప్రాసన వేడుక ఫోటోలు..!

Suma Kallamadi

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకోవడానికి హన్షిత రెడ్డి కారణం అని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. 2017 వ సంవత్సరం లో దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో హన్షిత తల్లి లేని అమ్మాయి అయిపోయింది. దిల్ రాజు కూడా తోడు లేని ఒంటరి పక్షి అయిపోయాడు. దాంతో తోడు లేని లోటు ని కాస్తయినా భర్తీ చేసుకోమని హన్షిత రెడ్డి దిల్ రాజు ని కోరడంతో అతను తేజస్విని అనే అమ్మాయిని కొన్ని వారాల కిందట పెళ్లి చేసుకున్నాడు. 

IHG

 


హన్షిత రెడ్డి అర్చిత్ రెడ్డి ని 2014 మే రెండవ తేదీన తమిళనాడులోని ఊటీ లో పెళ్లి చేసుకుంది. అయితే ఈ ఇద్దరి దంపతులకు గతంలో ఒక బాబు (పేరు అరాంశ్) జన్మించగా... ఇటీవల ఒక పండంటి బిడ్డ కూడా పుట్టింది. అమ్మాయి పుట్టిన సందర్భంగా తన అమ్మ అనితానే తనకి బిడ్డ రూపంలో పునర్జన్మ ఎత్తారని హన్షిత రెడ్డి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. 

IHG

 


సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసి అభిమానులను బాగా అలరిస్తుంది హన్షిత రెడ్డి. అయితే నేటికి తన అమ్మాయి ఇషికా పుట్టి ఆరు నెలలు కావస్తుండగా సకుటుంబ సపరివార సమేతంగా హైదరాబాద్ నగరంలోని ఒక దేవాలయంలో ఆ బాలిక అన్నప్రాసన వేడుకలను గ్రాండ్ గా జరిపారు. 


ఐతే దిల్ రాజా ముద్దుల మనవరాలు అయిన ఇషికా అన్నప్రాసన వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూతురు హన్షిత రెడ్డి ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇకపోతే అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో హన్షిత రెడ్డి కుమారుడు నటించడన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: