ఇద్దరు బడా హీరోలు అయిన తారక్, రణవీర్ సింగ్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే..?

frame ఇద్దరు బడా హీరోలు అయిన తారక్, రణవీర్ సింగ్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే..?

Suma Kallamadi

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక క్రేజ్ తో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ గతంలో లాగా కాకుండా మంచి కథలను ఎంపిక చేసుకొని ఉత్తమ నటుడిగా పేరు పొందుతున్నాడు. అతని డైలాగ్ డెలివరీ, డాన్సింగ్ స్కిల్స్ అంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. బొద్దుగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమా లో మరీ సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా పర్ఫెక్ట్ ఫిగర్ తో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. 


టెంపర్ సినిమా లో సిక్స్ ప్యాక్ తో కనిపించి అభిమానులకు కన్నుల విందు చేశాడు. జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో అద్భుతంగా నటించి తన నటనా చాతుర్యాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్ కు అందరూ ఫిదా అయిపోయారు. టాలీవుడ్ పరిశ్రమలో అత్యంత సహజంగా నటించే వారిలో తారక్ టాప్ ప్లేస్ లో ఉంటాడు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


తెలుగు లో తారక్ కి ఎంత పాపులారిటీ ఉందో హిందీలో రణవీర్ సింగ్ కి కూడా అదే స్థాయిలో పాపులారిటీ ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్ బీర్ కపూర్ వంటి బాలీవుడ్ బడా స్టార్లకు పోటా పోటీగా నిలిచిన రణవీర్ సింగ్ మాస్ ఆడియన్స్ ని, మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ని కూడా తన నటనతో అలరించగలడు. బాజీరావ్ మస్తానీ, గల్లీ బాయ్, పద్మావత్, శింబ వంటి చిత్రాల్లో తన నటన ప్రదర్శనకు భారత దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. 


హాలీవుడ్ ప్రముఖ హీరో విల్ స్మిత్ కూడా గల్లీ బాయ్ సినిమాలో రణవీర్ ఆటోనగర్ ఫిదా అయిపోయి అతడిని బాగా ప్రశంసించాడు. ఇంత పాపులారిటీ ఉన్న రణవీర్ సింగ్, తారక్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే అది భారతదేశ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సంచలనమే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరూ చాలా గొప్ప నటులు, డాన్సర్స్ కావడం తో ఆ సినిమా లో ప్రతి సన్నివేశం చూడదగినదే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: