హెరాల్డ్ విజేత: 'టాలీవుడ్'కి ఎంతమంది లవర్ బాయ్స్ వచ్చినా ఫస్ట్ ప్లేస్ మాత్రం 'ఉదయ్ కిరణ్'దే!

Durga Writes

దాదాపు 18 సంవత్సరాల క్రితం లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ అప్పటి స్టార్ హీరోలకు ధీటుగా విజయాలు సాధించారు. చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. కెరీర్ ప్రారంభం నుండి అద్భుతమైన కథలను ఎంచుకున్న ఉదయ్ కిరణ్ భవిష్యత్తులో టాలీవుడ్ నే శాసించే స్థాయికి ఎదుగుతాడని అప్పట్లో దర్శకనిర్మాతలు భావించారు.

 

 

ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలకు ఇప్పటికీ టీవీల్లో ఆదరణ దక్కుతోంది. ఉదయ్ యాక్టింగ్ ను ఇష్టపడే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అప్పటి యూత్ అంతా ఉదయ్ సినిమా విడుదలైతే చాలు థియేటర్లకు క్యూ కట్టేవాళ్లు. వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కు ఆ తరువాత వరుస ఫ్లాపులు పలకరించాయి. మనసంతా నువ్వే తరువాత ఉదయ్ ఎంచుకున్న కథల వైఫల్యమో... ఇతర కారణాల వల్లో నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

 

 

అమ్మాయిల గుండెల్లో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ ను వరుస ఫ్లాపులు కృంగదీశాయి. కొన్ని సినిమాలు ప్రారంభమైన తరువాత ఆగిపోయాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది లవర్ బాయ్ లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ ఉదయ్ కిరణ్ మాత్రం లవర్ బాయ్ గా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాడనటంలో సందేహం అవసరం లేదు. సినీవినీలాకాశంలో ఉన్నత స్థాయికి చేరిన ఉదయ్ వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు.

 

 

ఉదయ్ ఆత్మహత్య గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అవకాశాలు రాకపోవడం వల్లే ఉదయ్ చనిపోయాడని పలువురు అభిమానులు చెబుతూ ఉంటారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలు సాధించి ఉదయ్ విజేతగా నిలిచారు. తన నటనతో అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: