డబ్బు పిచ్చి ఉన్న భార్యగా కాజల్ నటన అదుర్స్ అని చెప్పాలి..?

praveen
తెలుగు చిత్రపరిశ్రమలో కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కాజల్ అగర్వాల్ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే చెప్పాలి, ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.


 ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అయితే కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే నటించినా కానీ హీరోలకు భార్య పాత్రలో మాత్రం ఏ సినిమాలో నటించలేదు. కానీ ఇటీవలే యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం సీత. ఈ ప్రేమను నమ్మకుండా ఎంతో ప్రాక్టికల్గా ఆలోచించే పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ కెరీర్లోనే సీత సినిమాలో నటించిన నెగటివ్ పాత్ర మొదటిది అని చెప్పాలి.



ఇప్పటివరకు ఎప్పుడూ కూడా నెగటివ్ పాత్రలో నటించలేదు కాజల్ అగర్వాల్. ముఖ్యంగా ఈ సినిమాలో డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా నటిస్తోంది. అయితే తన ఆస్తి తనకు రావాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఈ సినిమాలో . ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను  పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా అతన్ని  వదిలేసి తన డబ్బు తనకి రావడంతో మళ్లీ నెగిటివ్ పాత్రలో కి వచ్చేస్తుంది కాజల్ అగర్వాల్. ఇలా ఈ సినిమాలో  నెగటివ్ పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది అనే చెప్పాలి. మొదటిసారి నెగటివ్ పాత్ర చేసినప్పటికీ కాజల్ అగర్వాల్ మాత్రం తన నటనతో ఆకట్టుకుంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: