భారీ ధర పలుకుతున్న నాగ చైతన్య సినిమా..!!

KSK

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ ముందు దాదాపు కంప్లీట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయటానికి రెడీ అయింది. ఆ సమయంలోనే కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వటంతో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో జరుగుతున్న సినిమా షూటింగ్ లు మరియు అన్ని థియేటర్లు క్లోజ్ అవడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం అనుకున్న 'లవ్ స్టోరీ' సినిమా యూనిట్ కూడా అన్ని కార్యక్రమాలు పక్కనపెట్టేసింది.

'ఫిదా' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై శాటిలైట్ ధరలు భారీ స్థాయిలో పలుకుతున్నాయి అని ఫిలిం నగర్ లో వినపడుతున్న టాక్. కాగా ప్రస్తుతం సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేని నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా భారీ స్థాయిలో రేట్లు పలుకుతున్నాయి అని దీనికోసం జి5 మరియు అమెజాన్ ప్రైమ్ లాంటివి పోటీ పడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ నాగ చైతన్య నటించిన అన్ని సినిమాలలో కంటే 'లవ్ స్టోరీ' సినిమా ఎక్కువ రేటు పలుకుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఈ సినిమాలో మొట్టమొదటిసారి నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: