మహేష్ బాబుకి రష్మిక స్పెషల్ గిఫ్ట్..!

shami

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి సర్ ప్రైజ్ కానుకలు పంపించింది కన్నడ భామ రష్మిక మందన్న. మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన రష్మిక మందన్నసినిమా సక్సెస్ లో తన వంతు కృషి చేసింది. అప్పటివరకు యువ హీరోలతో మాత్రమే చేసిన రష్మిక మహేష్ సినిమాతో స్టార్ క్రేజ్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ టైం లో కూర్గ్ లోని తన ఇంటికే పరిమితమైన రష్మిక మందన్న మహేష్ బాబు కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించింది.

కొన్ని మామిడికాయలు, ఆవకాయ పచ్చడి మరికొన్ని ఫ్రూట్స్ ఇలా అన్ని ఓ ప్యాక్ చేసి మహేష్ బాబుకి సెండ్ చేసింది రష్మిక.. ఆమె పంపించిన ఈ చిరు కానుకని నమ్రత తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేశారు. కన్నడలో కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రష్మిక తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇవ్వడమే హిట్టు కొట్టింది. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది అమ్మడు. 

సరిలేరు నీకెవ్వరు తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది రష్మిక. ఈ సినిమాతో పాటుగా తమిళంలో విజయ్, మురుగదాస్ కాంబో సినిమాలో కూడా అమ్మడు నటిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి రష్మిక స్టార్స్ మీద తన అభిమానాన్ని చూపిస్తూ ఆ హీరోల ఫ్యాన్స్ అభిమానాన్ని గెలుచుకుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రష్మిక వరుస ఛాన్సులతో అదరగొట్టేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: