అంకిత భావం, టాలెంట్‌ ఉంది కాబట్టే.. చెల్లి గురించి కరీష్మా!

JSR
సినీ రంగంలో హీరోయిన్‌ కెరీర్‌ నీటి బుడగ లాంటింది. గ్లామర్‌ ప్రపంచంలో హీరోయిన్లు 10 ఏళ్ల పాటు కొనసాగటమే గొప్ప. అలాంటి రెండు దశాబ్దాల పాటు అది కూడా స్టార్ హీరోయిన్‌ హోదాలో కొనసాగటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను అందుకుంది బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కరీనా కపూర్‌. 2000లో సంవత్సరంలో రెఫ్యూజీ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది కరీనా.

ఆ తరువాత తన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌ గా ఘన విజయాలు కూడా అందుకుంది. కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి ఈ జనరేషన్‌ హీరోయిన్‌లకు ఇన్సిపిరేషన్‌గా నిలిచింది. సహనటుడు సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లాడిన ఈ భామ పెళ్లి తరువాత కూడా హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ సినిమాల్లో నటిస్తోంది. వయసు పెరుగుతున్న కొద్ది తన అందానికి మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్న కరీనా తన 20 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
My first shot was at 4 am... I woke up this morning at 4, looked in the mirror, and said to myself that this was the best decision I could have ever taken. 20 years of hard work, dedication, and self-confidence... ❤️ I am extremely grateful to all my fans for all your love, support, and strength... Thank you #JPDutta for my life in the movies... @bachchan for being the sweetest co-star... and every single person involved in this film. Want to go back in time... ❤️❤️ #20YearsAndNotGivingUp

A post shared by kareena kapoor Khan (@kareenakapoorkhan) on

తొలిసారి తాను కెమెరా ముందు నిల్చున్న సందర్భంగా తీసిన ఫోటోను షేర్‌  చేస్తూ `నా తొలి షాట్‌, రిఫ్యూజీ (2000)` అంటూ కామెంట్ చేసింది. తన తొలి సన్నివేశాన్ని ఉదయం 4 గంటల సమయంలో తెరకెక్కించినట్టుగా వెల్లడించింది కరీనా. అయితే ఈ ఫోటోను కరీనా అక్క కర్మీషా కూడా షేర్ చేసింది. తన చెల్లెలి సినీ ప్రయాణం పట్ల తాను ఎంతో గర్వంగా ఉన్నానంటూ ట్వీట్ చేసిన కరీష్మా తన బలం, అంకిత భావం, టాలెంట్‌ కారణంగానే సుధీర్ఘ కాలం సినిమాల్లో రాణించగలిగిందని కామెంట్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
So proud of my sister.. to strength , determination , and of course talent 💕🙏🏼 love you ❤️ #20yearsofkareena #sisterlove

A post shared by KK (@therealkarismakapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: