మ్యాగజైన్ ఫోటోల కోసం హద్దులు చెరిపేసిన నిహారిక..!!
నీహారిక కొణిదెల.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నీహారిక ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో కథానాయికగా నటించింది. ఇక `ఒక మనసు` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ మెగా డాటర్.. నటన పరంగా ప్రేక్షకులను మెప్పించింది.
ఈ సినిమా తర్వాత నాన్న కూచి,హ్యపి వెడ్డింగ్, ‘సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించిన నిహారికకు.. పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు మాత్రం భాగానే అలరిస్తున్నాయి. ఇక నిహారిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ కుమారుడు వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఏడడుగులు నడవబోతుంది.
ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్నాడు చైతన్య. అంతేకాదు, చాలా కాలం నుంచి మెగా ఫ్యామిలీతో చైతన్య కుటుంబసభ్యులకు సాన్నిహిత్యం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే.. నిహారిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
అయితే గతంలో ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్లో పాల్గొంది ఈ మెగా డాటర్. ఈ ఫోటో షూట్లో నిహారిక హద్దులు చెరిపేసి మరీ హాట్ కనిపించిందనే చెప్పాలి. అప్పట్లో ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.