స్టార్ హీరో లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంచరపాలెం దర్శకుడు !

Seetha Sailaja

టాలీవుడ్ టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ వర్మ గతంలో అనేకసార్లు కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసాడు. అయితే వివాదాలు లేకుండా వర్మ ఉండడు కాబట్టి చాలామంది వర్మ కామెంట్స్ ను లైట్ గా తీసుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ లు లేక ఇంటికే పరిమితం అవుతున్న టాప్ హీరోలు బయటకు చెప్పకపోయినా వారి కెరియర్ గురించి లోలోపల మధన పడుతున్నారు అన్న విషయం ఎవరు కాదనలేని నిజం.


ఈపరిస్థితుల నేపధ్యంలో యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ‘C/O కంచరపాలెం’ మూవీతో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మహా ఇలా టాప్ హీరోలను ఎందుకు టార్గెట్ చేసాడు అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు.


వాస్తవానికి మహా తీసిన ‘C/O కంచరపాలెం’  మూవీని మహేష్ బాబు రాజమౌళి క్రిష్ సుకుమార్ లతో పాటు మరికొందరు ఇండస్ట్రీ ప్రముఖులు కూడ మెచ్చుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మహా మలయాళ హిట్ చిత్రం ‘మహేషింతే ప్రతీకారం’ చిత్రానికి రీమేక్ గా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాకి దర్శకత్వం వహించాడు. ‘బాహుబలి' వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.


యంగ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈమూవీ ధియేటర్లు ఓపెన్ అయిన తరువాత విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మహా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోలు కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అని తెలుస్తోంది. అంతేకాదు చాలా మంది స్టార్ హీరోలకి స్టోరీలను కొత్త రకమైన కథలని అర్థం చేసుకునే శక్తి లేదని చాలామందికి ‘ఆకలి అంటే ఏమిటో ఆకలితో ఉండటం అంటే ఏమిటో’ అన్న పదాల మధ్య తేడా తెలియదు అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో ఈ యంగ్ హీరోకు ఇప్పుడు ఇలా టాప్ హీరోల పై ఎందుకు కోపం వచ్చింది అంటూ చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు షాక్ అవుతున్నారు..   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: