అదిరే స్టెప్పులతో `దిమాక్ కరాబ్` చేసిన రామ్..!!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. నిధి అగర్వాల్, నాభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాని నిర్మించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద అరాచకం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పెట్టిన పెట్డుబడికి మూడింతల లాభాల్ని తీసుకొచ్చి.. దర్శక, హీరోల హిట్ దాహం తీర్చింది.
రామ్ కెరీర్లో కూడా తొలిసారి 40 కోట్ల షేర్‌కు చేరువగా వచ్చిన సినిమా ఇది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక తాను క్లాస్, మాస్ రెండింటిని మెప్పించగలనని హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్‌తో క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం లుక్ నుంచి మాట, నడక, నడత మార్చుకోవడం.. దాన్ని ప్రజెంట్ చేయడంలో సూపర్ హిట్ అయ్యాడు. హైదరాబాదీ భాషను ఒడిసిపట్టుకొన్న విధానం, దానిని డెలివరీ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అంతేకాదు, డ్యాన్స్ విషయంలోనూ రామ్ అదరగొట్టాడు. ముఖ్యంగా `దిమాక్ కరాబ్` సాంగ్ అదిరే స్టెప్పులతో రామ్ నిజంగా దిమాక్ కరాబ్ చేశాడు. పక్కా మాస్ మసాలా, డీజే స్టైల్లో స్వరబ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన బీట్‌కి తగ్గట్టు, రామ్ ఫుల్ ఎనర్జిటిక్‌గా, చాలా ఈజ్‌తో వేసిన స్టెప్స్‌కి థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసాడు. తెలంగాణ యాసలో సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. కీర్తన శర్మ, సాకేత్ అంతే అద్భుతంగా ఆలపించారు. మరియు నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోతతో ఈ పాట మాస్కు పిచ్చెక్కించింది.