ఆ ఒక్క పాటతో డాన్స్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు అల్లు అర్జున్..?
టాలీవుడ్లో కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన ప్రతి సినిమాలో కూడా తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీసిన విషయం తెలిసిందే. ఇక ప్రతి డాన్స్ పర్ఫామెన్స్ కూడా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే ఎన్ని పాటల్లో డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఇరగదీసినప్పటికీ తెలుగు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిన సాంగ్ మాత్రం... నా పేరు సూర్య సినిమా లోని లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో సాంగ్. ఈ పాట లో అల్లు అర్జున్ డాన్స్ ఎంత స్టయిలిష్ గా ఉంటుంది అన్నది అసలు మాటల్లో చెప్పలేము.
ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ చూడని సరికొత్త డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఈ పాటలో అదరగొట్టాడు అల్లు అర్జున్. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన క్యాప్ ట్రిక్స్ అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ హీరో కూడా ప్రయత్నించ లేదు అని చెప్పాలి. అంతేకాకుండా సంవత్సరాల తరబడి నేర్చుకునే క్యాప్ ట్రిక్స్ ని కేవలం నెలల సమయం లో నేర్చుకుని అది కూడా తక్కువ సమయంలోనే దానిని డాన్స్ రూపంలో మలిచి తెలుగు ప్రేక్షకులందరికీ సరి కొత్త రకం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ని పరిచయం చేశాడు అల్లు అర్జున్. ఇక ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి.Powered by Froala Editor