అల్లు అరవింద్ మెగా స్కెచ్ కి షాక్ లో అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లు !
నిన్న ఆహా లో విడుదలైన ‘భానుమతి అండ్ రామకృష్ణ’ మూవీకి ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ మూవీకి విమర్శకుల దగ్గర నుండి కూడ ఎవరేజ్ మార్కులు మాత్రమే పడ్డాయి. దీనితో ‘ఆహా’ ను అమెజాన్ నెట్ ఫ్లిక్స్ ల స్థాయికి తన సొంత కంటెంట్ తో తీసుకు వెళ్ళాలి అని అరవింద్ చేసిన ప్రయత్నాలకు మొదట్లోనే విఘాతం కలిగింది.
‘భానుమతి అండ్ రామకృష్ణ’ మూవీకి సంబంధించి కథలో వెరైటీ లేకపోవడం నిర్మాణ విలువల్లో రాజీ కనిపించడంతో ఈమూవీ పై చాలామంది పెదవి విరుస్తున్నారు. ఈ కథలో అద్భుతాలు లేవు సామాన్యమైన కథ మాత్రమే అని జనం తెల్చేయడంతో సాధారణ టైమ్ పాస్ మూవీగా మాత్రమే ఈమూవీ మిగిలిపోతుంది.
ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఆహా ను మరింత పరుగులు తీయించడానికి అరవింద్ తీసుకున్న మరొక లేటెస్ట్ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సెన్సార్ కూడ పూర్తి అయిపోయి విడుదలకు మార్గాలు లేకుండా ఆగిపోయిన 20 చిన్న సినిమాలను అరవింద్ ఆహా కోసం కొని ఇప్పటి నుండి ప్రతి శుక్రు వారం తన ఆహా లో ఒక చిన్న సినిమా విడుదల అయ్యేలా స్కెచ్ వేసినట్లు టాక్.
ఈ సినిమాలు అన్నింటిని అతి తక్కువ మొత్తాలకు కొనడం కాని లేదంటే 50 – 50 బేసెస్ పై ఆహా కు పెరిగే సబ్ క్రిక్షన్స్ మొత్తాలను అదేవిధంగా వ్యూకి ఇంత రేటు గట్టి ఎంతమంది చూస్తే అంత డబ్బు ఇచ్చేందుకు అరవింద్ ఆహా కోసం ఒక ప్యాకేజ్ రెడీ చేసాడు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఆలోచనలు అన్నీ చేయాలని అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఆలోచిస్తున్నాయి. అయితే వారు ఇంకా ఈ ఆలోచనలు అమలు చేయకుండానే అరవింద్ ఆహా కోసం వేసిన మాష్టర్ ప్లాన్ అమెజాన్ నెట్ ఫ్లిక్స్ ల దృష్టికి రావడంతో ఆసంస్థలు కూడ అరవింద్ తెలివితేటలకు షాక్ అవుతున్నట్లు టాక్..