అందాల నివేదాను ఇలా ఎప్పుడైనా చూశారా..?

Kavya Nekkanti

నివేదా థామస్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా థామస్. మలయాళం సినిమా `వెరుథె ఒరు భార్య` సినిమాలో జయరాం కుమార్తెగా నటించి..  నటన ప‌రంగా ప్రశంసలు అందుకుంది. 

ఇక తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `జెంటిల్ మేన్` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటి. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుని, నటన పరంగా నివేదా థామస్ మంచి మార్కులను కొట్టేసింది. 

ఈ చిత్రం త‌ర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా.. ఇలా వ‌రుస సినిమాలు చేస్తోంది.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌రియు తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్‌డం సంపాదించుకుంది. 

అలాగే ఇటీవ‌ల ఈమె ‘దర్బార్’ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురిగా.. న‌టించి మెప్పించింది. ఇక మ‌రోవైపు ఈ అమ్మ‌డు త‌న క్యూట్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తే అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా కూడా నివేదా థామ‌స్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: