పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..!
అతడు ఎక్కడ కనిపించినా పవన్ కళ్యాణ్ అభిమానులు వెంటనే పవర్ స్టార్ తో ఎప్పుడు సినిమా తీస్తున్నారని ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తానని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పకుండా తిరుగుతున్నాడు. దీంతో మెగా అభిమానుల్లో తనపై బాగా కోపం పెరిగిపోతుంది. వారిని శాంత పరచాలంటే పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో ఒక సినిమా తీయాలి కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు. అలాగే రెండు సినిమాలను పెండింగ్ లో పెట్టాడు. మొత్తం కలిపి అయిదు సినిమాలు పూర్తవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. అప్పటిదాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఏ సినిమా రాకపోతే మెగా అభిమానుల్లో అసహనం ఎక్కువ అవుతుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించి పవన్ కళ్యాణ్ తో ఏదో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే తాను తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం అభిమానుల్లో కాస్త అసహనాన్ని తగ్గించిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ ప్రొడక్షన్ ఉపయోగించుకొని రామ్ చరణ్ తో ఒక సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా చేస్తే అభిమానుల్లో కాస్తయినా అసహనం తగ్గుతుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నాడు. అలాగే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథ రాసి సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని బలంగా నిశ్చయించుకున్నాడు. ఏదేమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ అభిమానుల్లో కాస్త నిరాశనే మిగిల్చాడని చెప్పుకోవచ్చు.
Powered by Froala Editor