బిత్తిరి సత్తి.. బిగ్ బాసా.. మరో ఛానెలా..!

shami

వి6 న్యూస్ లో తీన్మార్ వార్తలతో బాగా పాపులర్ అయ్యాడు బిత్తిరి సత్తి అలియాస్ చెవెళ్ల రవి. ఇప్పటికి కూడా అతని అసలు పేరు ఎవరికి తెలియదంటే నమ్మాలి. తను చేసే కవరేజ్ లో తన హావభావాలు.. భాషతో అలరిస్తాడు. ప్రేక్షకులకు కావాల్సిన ఇన్ ఫర్మేషన్ తో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాడు. బిత్తిరి సత్తితో పాటుగా శివజ్యోతి కూడా తీన్మార్ వార్తల ద్వారా పాపులర్ అయ్యింది. అందుకే బిగ్ బాస్ సీజన్ 3లో ఆమెకు ఛాన్స్ వచ్చింది. శివజ్యోతి బిగ్ బాస్ కు వెళ్లడంతో బిత్తిరి సత్తి వ్6ని వదిలేశాడు.

 

ఇక అక్కడ నుండి బయటకు వచ్చిన బిత్తిరి సత్తి టివి9 లో చేరాడు. ఇస్మార్ట్ న్యూస్ అంటూ మళ్లీ శివ జ్యోతితోనే కలిసి ఈ షో చేస్తున్నాడు. ఏమైందో ఏమో కాని అక్కడ కూడా బిత్తిరి సత్తికి కంఫర్టబుల్ గా లేదనుకుంటా అందుకే టివి 9 నుండి కూడా ఎగ్జిట్ అయ్యాడు. తనకు కావాల్సిన ఫ్రీడం ఇవ్వట్లేదని టివి9 నుండి బయటకు వచ్చాడు బిత్తిరి సత్తి. ఇక ఇప్పుడు బిత్తిరి సత్తిని సాక్షి వారు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఆయన అడిగినంత శాలరీతో పాటుగా కావాల్సినంత ఫ్రీడం కూడా ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారట,

 

ఆల్రెడె సాక్షితో బిత్తిరి సత్తి చర్చలు ముగిశాయట. త్వరలోనే బిత్తిరి సత్తి సాక్షిలో కనిపిస్తాడని అంటున్నారు. ఏది ఏమైనా తనకు ఈ క్రేజ్ తెచ్చిన వి6 ని వదిలి వచ్చి బిత్తిరి సత్తి తప్పు పనిచేశాడని అందరు అంటున్నారు. కొన్ని సార్లు రెమ్యునరేషన్ మాత్రమే చూసుకుంటే ఆ ఎఫెక్ట్ కెరియర్ మీద కచ్చితంగా పడుతుంది. మరి సాక్షిలో అయినా బిత్తిరి సత్తి కొన్నాళ్లు నికకడగా ఉంటాడా లేదా అన్నది చూడాలి. ఒకమాట బిగ్ బాస్ సీజన్ 4లో బిత్తిరి సత్తి కూడా సెలెక్ట్ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి వాటిల్లో ఏమాత్రం వాస్తవం ఉందో త్వరలో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: