పుష్ప సినిమాలో నేను లేను.. కన్ఫర్మ్ చేసిన నటుడు..

Pranateja Sriram

అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం పుష్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న కావడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటోంది.  రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

 

ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. లారీ డ్రైవర్ గెటప్ లో బన్నీ చాలా ఊరమాస్ గా కనిపించాడు. అయితే పుష్ప సినిమా విషయమై అనేక కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఆదిపినిశెట్టి నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కి అన్నయ్యగా నటించిన ఆది పినిశెట్టి పుష్ప సినిమాలోను బన్నీకి అన్నయ్యగా కనిపించనున్నాడని, సర్పంచ్ పాత్రలో ఆదిపినిశెట్టి నటిస్తున్నాడని అన్నారు.

 

 

సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ వార్తలు ఆది పినిశెట్టి వద్దకి చేరుకున్నాయట. వీటిపై స్పందించిన ఆది పినిశెట్టి తన సమాధానాన్ని తెలిపాడు. పుష్ప సినిమాలో తాను నటించడం లేదనీ, అసలు ఆ సినిమా నుండి తనమి ఎవరూ సంప్రదించలేదని తెలిపాడు. అందువల్ల పుష్ప సినిమాలో ఆది నటిస్తున్నాడని వచ్చిన వార్తలు వట్టి పుకార్లేనని తేలిపోయింది.

 

 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: