ఆ పాత్రలో నటించి కూతురిపై తండ్రి కి ఎంత ప్రేమ ఉంటుందో చూపించిన నరేష్..?
అయితే అల్లరి నరేష్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో హీరోయిన్ లకు తండ్రి పాత్రలో నటించారు. అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిన తండ్రి పాత్ర మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా సమంతా హీరోయిన్ గా తెరకెక్కిన అఆ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాలో సమంత తండ్రి పాత్రలో నటించారు నరేష్. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే కూతురిని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో నరేష్ నటిస్తారు. తండ్రి కూతురు కలిసి తల్లి చాటున చేసే అల్లరి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో నరేష్ పండించే హావభావాలు... కామెడీ టైమింగ్.. కూతురు సమంత తండ్రి నరేష్ మధ్య జరిగే సంభాషణలు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయాయి.
అచ్చం సాదాసీదా జీవితంలో తండ్రి కూతురు ఎలా ఉంటారో అలాగే ఈ సినిమాలో కూడా నరేష్ సమంత పాత్రను తీర్చిదిద్దారు దర్శకుడు త్రివిక్రమ్. తండ్రి పాత్రలో నరేష్ నటించిన తీరు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. ఇలా ఆ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో నరేష్ తండ్రి పాత్రలో తన నటనతో ఎంతగానో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు అని చెప్పాలి.
Powered by Froala Editor