ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!
ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ కు యువి క్రియేషన్స్ శుభవార్త చెప్పింది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ.. నిరుత్సాహపరుస్తూ.. టీజర్ ను వాయిదాల మీద వాయిదాలు వేశారు. టీజర్ ను రెడీ చేయలేకపోయినా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేందుకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.., టైటిల్ ను కూడా ప్రకటిస్తున్నారు.
సాహో సెట్స్ పై ఉన్నప్పుడే.. ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్ లో పిరియాడిక్ లవ్ స్టోరీ మొదలైంది. పూజా హెగ్డే హీరోయిన్. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతలో శర్వానంద్, సమంత జంటగా జాను మూవీ రావడంతో.. ఈ రెండు టైటిల్స్ ఒకేలా ఉన్నాయన్న ఫీలింగ్ కలగడంతో.. మరో రెండు టైటిల్స్ అనుకున్నారు. రాధేశ్యాం.. ఓ డియర్ లు వార్తల్లో వినిపించినా.. అన్ని భాషల్లో రాధే శ్యాం టైటిల్ పెట్టేందుకు చిత్రయూనిట్ మొగ్గుచూపుతున్నారట.
సాహో ఆలస్యంతో రాధేశ్యాం షూటింగ్ కూడా లేటవుతూ వచ్చింది. సాహో ఫ్లాప్ తర్వాత కొన్ని నెలల పాటు.. షూటింగ్ కు దరంగా ఉన్న ప్రభాస్.. సెట్స్ పైకి రాగానే.. కరోనా అడ్డుకుంది. 80శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నా.. ఇంతవరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకపోవడంతో.. యువి క్రియేషన్స్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. నిర్మాతలను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. టైటిల్ రాధే శ్యాం ఫిక్స్ అయిందంటూ.. ఫ్యాన్స్ ప్రకటించేశారు.
ఇంతకాలం ఆశపెట్టిన రాధే శ్యాం టీమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ తో టైటిల్ ఎనౌన్స్ చేసే డేట్ అండ్ టైమ్ రిలీజ్ చేసింది. ఈ నెల 10న ఉదయం 10గంటలకు విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. లవర్ బాయ్ గా ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో తెలియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. పాన్ ఇండియా మూవీ కావడంతో.. సౌత్ లోని అన్ని భాషలతో పాటు.. హిందీలో కూడా టైటిల్ ను ఒకేసారి విడుదల చేస్తారు.