మహేశ్ కు నచ్చిన వెబ్ సిరీస్.. ట్వీట్ చేసిన సూపర్ స్టార్

Murali

తమ అభిమాన హీరోలను ఫాలో అవడం ఫ్యాన్స్ కు అలవాటు. హీరో పుట్టినరోజుకు అన్నదానాలు చేయడం, సినిమాల్లో హీరో చేసే మంచి పనులను సొసైటీ చేయడం చేస్తూంటారు. హీరో ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చినా తూచ తప్పకుండా చేస్తూంటారు ఫ్యాన్స్. సినిమాల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఓ సినిమాను మరో స్టార్ హీరో ప్రమోట్ చేస్తే ఫ్యాన్స్ కూడా ఆ సినిమాను ఆదరిస్తారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం మహేశ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.

 

రీసెంట్ గా తాను చూసిన ఓ వెబ్ సిరీస్ ను మెచ్చుకున్నాడు మహేశ్. జర్మన్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ‘డార్క్’ అనే వెబ్ సిరీస్ చాలా బాగుందని కితాబు ఇచ్చాడు. సిరీస్ ఆసాంతం ఆసక్తికరంగా తెరకెక్కించారని అందరూ చూడాలని తాను కోరుకుంటున్నానన్నాడు. ఒరిజినల్ జర్మన్ లాంగ్వేజ్ లోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలని పిలుపునిచ్చాడు. ఏకంగా సూపర్ స్టారే ఓ వెబ్ సిరీస్ ను మెచ్చుకుంటూ రేటింగ్ ఇవ్వడంతో మహేశ్ ఫ్యాన్సంతా ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ చూసే పనిలో పడ్డారు. తప్పకుండా ఆ వెబ్ సిరీస్ చూస్తామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

లాక్ డౌన్ నేపథ్యంలోనూ.. ప్రస్తుత పరిస్థితిలోనూ మహేశ్ తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ చూశాడు మహేశ్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. మహేశ్ పిలుపుతో ఇప్పుడు మరింతగా క్రేజ్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: