ముంబైలో నటి 'రేఖ' ఇంటికి సీల్.. ఎందుకంటే..

Murali

బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కోవిడ్ పాజిటివ్ రావడం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరికీ నానావతి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా ఈ వార్త సినీ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో సీనియర్ బాలీవుడ్ సెలబ్రిటీ కరోనాకు పరోక్షంగా ఎఫెక్ట్ అవడం చర్చనీయాంశమైంది. బాలీవుడ్ సీనియర్ నటి రేఖ ఇంటిపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఆమె ఇంటి సెక్యూరిటీ గార్డ్ ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రేఖ ఇంటికి సీల్ వేశారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.

 

ఈమేరకు ఓ నోటీసును కూడా ఆమె ఇంటి బయట అంటించారు. బాంద్రాలోని బంద్ స్టాండ్ ఏరియాలో ఉన్న రేఖ నివాసం సీ స్ప్రింగ్స్ ఆవరణలో కార్పొరేషన్ అధికారులు శానిటైజేషన్ చేశారు. ఆ ఏరియాను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. కరోనా సోకిన సెక్యూరిటీ గార్డ్ ను బాంద్రాలోని కుర్లా కాంప్లెక్స్ లో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఇంటికి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉండగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. మరో సెక్యూరిటీ గార్డ్ ను క్వారంటైన్ కు తరలించారు. ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ దేశంలో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులే ఇందుకు ఉదాహరణ.

 

సామాన్యులే కాకుండా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ మహమ్మారికి ఎఫెక్ట్ కావడం కలవర పెడుతోంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అమితాబ్ కు కరోనా సోకడంతో దేశవ్యాప్తంగా అమితాబ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఎన్నో జాగ్రత్తలు పాటించే సినీ ప్రముఖులకు కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉందో అర్ధమవుతోంది. దీంతో కరోనా తీవ్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: