సోషల్ మీడియాలో అనుపమ హంగామా.. ఫ్యాన్స్ ఖుషి..!

shami

మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. యువ హీరోలకు పర్ఫెక్ట్ ఆప్షన్ గా మారిన ఈ అమ్మడు కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా హంగామా చేస్తుంది. ఎప్పుడు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు టచ్ లోనే ఉండే అనుపమ తన అప్డేట్స్ తో అక్కడ క్రేజీ ఫాలోవర్స్ ను సంపాదించింది. వరుస హిట్లు కొడుతున్న వేరే హీరోయిన్స్ కు కూడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మడికి ఉంది. సినిమాలు చేస్తూనే తన పర్సనల్ విషయాలను.. తన ఆలోచనలను ట్విట్టర్, ఇన్ స్టా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసుకుంటుంది అమ్మడు.

 

అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ ప్రమేశ్వరన్ ఆ తర్వాత ప్రేమం సినిమా రీమేక్ లో కూడా మాత్రుకలో తన పాత్ర తానే చేసింది. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగి, హలో గురు ప్రేమ, రాక్షసుడు కోసమే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది అనుపమ. అందం, అభినయం రెండు ఉన్నా సరే అమ్మడికి ఇంకా లక్ కలిసి రావట్లేదు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అనుపమ.  

 

ఇక ఈమధ్యనే 7 మిలియన్ ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ ను ఏర్పరచుకున్న అమ్మడు ఈ విధంగా కూడా సత్తా చాటుతుంది. ఈమధ్య కాలంలో వచ్చిన హీరోయిన్స్ లో అనుపమ క్రేజ్ స్పెషల్ అని చెప్పొచ్చు. గ్లామర్ షో, స్కిన్ షోలు చేయకుండా హీరోయిన్ గా మెప్పిస్తున్న అమ్మడు ఇక అందుకు కూడా ఓకే చెబితే మాత్రం ఇక ఆమెకు తిరుగు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలకు సైన్ చేసిన అనుపమ తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ పరిశ్రమల్లో దూసుకెళ్తుంది.     

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Focused, intelligent ,motivated .. Oh ... and obviously cute 💋

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on

   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: