విరాట పర్వంలో కీలక పాత్ర వారిదే.. రానాని వెనక్కినెట్టి..!

Pranateja Sriram

నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఊడుగుల తన రెండవ చిత్రానికి రానాని హీరోగా ఒప్పించి విరాట పర్వం పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. మొదటి సినిమాతో సున్నితమైన అంశాన్ని తీసుకుని హృద్యంగా చెప్పిన వేణు ఈ సారి నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో మరో భావోద్వేగపూరితమైన కథని చెప్పబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్స్ కి మంచి స్పందన వచ్చింది.

1990 ప్రాంతంలో తెలంగాణలో నక్సల్స్ ఎక్కువగా ఉండేవారు. అప్పటి సంఘటనల్ని తీసుకుని కల్పిత కథతో విరాట పర్వం సినిమాని తెరకెక్కించాడట. విప్లవం అనేది ప్రేమ నుండే పుడుతుందన్న కాన్సెప్ట్ తో ప్రేక్షకులని ఆలోచింపజేసేదిగా ఉండనుందట. ఇప్పటికే తొంభైశాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా చిత్రీకకరణని నిలిపివేసింది. మిగతా భాగం పదిశాతాన్ని తెరకెక్కించడానికి రెండు వారాల సమయం పడుతుందట.

అయితే ఆ సీన్లని చిత్రీకరించడానికి మూడు వందల మంది అవసరమవుతారట. ప్రస్తుత సమయంలో అది సాధ్యం కాదు కాబట్టి నార్మల్ అయ్యే వరకూ వెయిట్ చేయనున్నారని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణితో పాటు నందితా దాస్, జరీనా వాహెబ్, ఈశ్వరీ రావ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

 

అయితే ఈ పాత్రలు చాల కీలకంగా వ్యవహరించనున్నాయట. రానా తర్వాత మహిళల పాత్రలే కీలకంగా ఉండనున్నాయట. ఆల్రెడీ నక్సలైట్ గా ప్రియమణి లుక్ రివీలై మంచి స్పందనని తెచ్చుకుంది. ఇతర పాత్రలు పోషించినవారు కూడా బలమైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తారట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: