ఇండస్ట్రీలో కొత్త జాబ్ చేస్తున్నా ఫిదా బ్యూటీ..??

KSK

మలయాళం సినిమా ‘ప్రేమమ్’ లో నటించి తెలుగులో అడుగుపెట్టక ముందే మంచి క్రేజ్ ని సంపాదించింది హీరోయిన్ సాయి పల్లవి. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమా తో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతర్వాత నాగశౌర్య తో ‘కణం’ అనే సినిమా, న్యాచురల్ స్టార్ నాని తో MCA సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మళ్లీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నాగచైతన్య సరసన నటిస్తోంది.

సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి చివరి దశలో ఉన్న టైములో కరోనా వైరస్ రావటంతో సినిమా వాయిదా పడింది. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానుంది అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా హీరోయిన్ సాయి పల్లవి మామూలుగానే మంచి క్లాసికల్ డాన్సర్. ఆ విషయం ఆమె ‘ఫిదా’ సినిమాలో మరియు కొన్ని సినిమాల్లో వేసిన స్టెప్పులు బట్టి ఇట్టే అర్థమవుతోంది.

కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న 'లవ్ స్టోరీ' సినిమాలో కొన్ని సాంగ్ లకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల సాయి పల్లవి ని కొరియోగ్రాఫర్ చేయాలని ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం సినిమా షూటింగులు ఏమీ లేకపోవడంతో ఈ కొత్త జాబు కి సాయి పల్లవి  ఓకే చెప్పినట్లు… తాను హీరోయిన్ గా చేస్తున్న సినిమా పాటలకి స్వయంగా సాయి పల్లవి కొరియోగ్రాఫ్ చేయటానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: