నాగ్.. కొడుక్కి గైడెన్స్ ఇస్తున్నాడా..?
అఖిల్ ఆలోచనలతో అక్కినేని అభిమానులు మరింత డిసప్పాయింట్ అవుతున్నారు. సిసింద్రి తండ్రి సలహాలు తీసుకుంటున్నాడా లేదా.. అసలు నాగ్ కొడుక్కి గైడెన్స్ ఇస్తున్నాడా.. లేకపోతే అఖిల్ తండ్రి సలహాలు పట్టించుకోవడం లేదా.. ఇలా అక్కినేని అభిమానుల్లో బోల్డన్ని సందేహాలు వస్తున్నాయి.
అఖిల్ భారీ బజ్ తో ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఫస్ట్ మాస్ హీరో అవుతాడనే అంచనాలతో సినిమాల్లోకి వచ్చాడు. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరుగా ఉంది. సిసింద్రీ ఇప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ కొట్టలేదు. బ్యాక్ గ్రౌండ్ కు తగ్గట్టుగా స్టార్ రేసులో సత్తా చాటలేకపోతున్నాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.
అఖిల్ మనం సినిమాలో ఒక మెరుపు మెరిశాడు. చిన్న సీన్ లో కనిపించి థియేటర్ లో మేజిక్ చేశాడు. ఆ హంగామా చూసి సిసింద్రీ ఇరగదీస్తాడు అని హోప్స్ పెట్టుకున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య ముగ్గురికీ రొమాంటిక్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఇక అఖిల్ ఈ ఫ్యామిలీ నుంచి మొదటి మాస్ హీరో అవుతాడని లెక్కలేశారు అభిమానులు.
అఖిల్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే వినాయక్ డైరెక్షన్ లో భారీ మాస్ ఎంటర్ టైనర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ హై ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. తర్వాత నాగార్జున రంగంలోకి దిగి మనంలో అఖిల్ ను ఒక రేంజ్ లో చూపించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో కొడుకుతో హలో సినిమా తీశాడు. అయితే ఈ మూవీ కూడా అంచనాలను అందకోలేకపోయింది.
అఖిల్ ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఒంగోలు గిత్త డిజాస్టర్ తర్వాత తెలుగులో మరో సినిమా చేయకుండా ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న భాస్కర్ మళ్లీ అఖిల్ మూవీతోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ డిస్కుల్లోనే ఉండిపోయింది.
ఇప్పుడు చాలా మంది హీరోలు సక్సెస్ ఉన్న డైరెక్టర్స్ నే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ అఖిల్ మాత్రం ఫెయిల్యూర్స్ ఉన్న మేకర్స్ కు కాల్షీట్స్ ఇస్తున్నాడు. దీంతో నాగార్జున అఖిల్ ను గైడ్ చేయడం లేదా.. స్టోరీలు, డైరెక్టర్స్ ను రిఫర్ చేయడం లేదా.. అని చర్చిస్తున్నారు. మరి అఖిల్ ఏ స్ట్రాటజీతో ఇలా సినిమాలకు సైన్ చేస్తున్నాడో చూడాలి.