సర్కారు వారి పాటలో రెండు పాత్రల్లో మహేష్

Gullapally Rajesh

టాలీవుడ్ లో సర్కారు వారి పాట సినిమా ఇప్పుడు హైలెట్. ఈ సినిమా ప్రకటన ఎప్పుడు అయితే వచ్చిందో అక్కడి నుంచి కూడా జనాలు ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే ఏ మాత్రం కూడా మిస్ అవకుండా చదివే పరిస్థితి అయితే ఉంది అనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా చాలా మందిని ఆకట్టుకుంది. మహేష్ బాబు ని గతంలో లేని విధంగా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్. ఈ సినిమాలో మహేష్ పాత్ర మీద దర్శకుడు చాలా వరకు ఫోకస్ పెట్టి చాలా సీన్స్ ని అతని ఇమేజ్ కి తగిన విధంగా రెడీ చేస్తున్నాడు అని అంటున్నారు. 

 

ప్రతీ సీన్ ని కూడా మహేష్ ఇమేజ్ కి తగిన విధంగా ప్లాన్ చేస్తూ వస్తు ఉన్నాడు అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ సినిమాలో మహేష్ రెండు పాత్రల్లో కనపడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకటి సిఎం కొడుకు గా అతను కనపడే అవకాశం ఉంది అని అదే విధంగా మరో పాత్రలో అతను బ్యాంకు ఉద్యోగి గా కూడా కనపడే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

 

ఈ పాత్ర కోసం ఇప్పటికే చాలా విధాలుగా దర్శకుడు ప్లాన్ చేసాడు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో బ్యాంకు ఆఫీసర్ గా నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె పాత్ర విషయంలో ఇంకా స్పష్టత అనేది రావడం  లేదు. సినిమాను  అసలు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ అనేది లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన వారు కూడా కొందరు  ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: