సాయి పల్లవి అవసరమైతే డాక్టర్ గా మారుతుంది తప్ప అలాంటివి మాత్రం చేయనే చేయదట ..?
ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ కాగా మరొక సినిమా రానా దగ్గుబాటి హీరోగా వస్తున్న విరాట పర్వం. ఈ రెండు సినిమాలు వేటికవే చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. అయితే సాయి పల్లవి టాలెంటెడ్ హీరోయిన్ అని తనతో సినిమా చేయాలన్న ఆలోచన దర్శకులకే కాదు హీరోలకి ఉండటం విశేషం. తెలుగు హీరోలకే కాదు తమిళ చిత్ర సీమలో ఉన్న స్టార్ హీరోలకి అదే భావన ఉంది.
అయితే సాయి పల్లవి మాత్రం వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోవడం లేదు సరి కదా అలాంటి స్క్రిప్ట్ తో ఇంకోసారి నన్ను సంప్రదించకండి అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఫిదా సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవికి వరసగా చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కాని వాటిలో సెలెక్టెడ్ గా కొన్ని సినిమాలనే కమిటయి నటించింది. అయితే ఆ సినిమాలు అనుకున్నంత సక్సస్ కాకపోయినప్పటికి ఇటు తెలుగులో గాని అటు తమిళంలో గాని సాయి పల్లవి క్రేజ్ కాస్త కూడా తగ్గకపోవడం ఆశ్చర్యకరం. ఆ కారణంగానే మంచి కథలను ఎంచుకొని చిత్ర సీమలో కొనసాగుతుంది.
ఇక సాయి పల్లవి కథ, పాత్రల విషయంలోనే కాదు ఎక్స్‌ఫోజింగ్ అండ్ గ్లామర్ విషయంలోను అలాగే కమర్షియల్ యాడ్ ఫిలింస్ లో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించదు. యాడ్ ఫిలింస్ తో జనాలని మోసం చేయడం నచ్చదన్న ఉద్దేశ్యమే ప్రధాన విషయం అయితే గ్లామర్ గా కనిపిస్తేనే సినిమాలలో దర్శక, నిర్మాతలు అవకాశాలిస్తారన్నది సరైన ఆలోచన కాదన్నది సాయి పల్లవి భావన.
నిజంగా అలాంటి అవకాశాలే వస్తే వదిలేయడానికి సిద్దమే కాదు అవసరమైతే సినిమాలు వదిలేసి తను డాక్టర్ గా మారడానికి సంతోషంగా నిర్ణయం తీసుకుంటానని సన్నిహితులతో అంటోందట. మొత్తానికి సాయి పల్లవి కి తన మీద తనకున్న నమ్మకం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.