ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన మెగాస్టార్ 'సైరా'.....!!

GVK Writings

మూడేళ్ళ క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ కి మళ్ళి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, తన క్రేజ్, బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇక దాని తరువాత యువ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా సైరా నరసంహారెడ్డి. తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. 

ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా పై, ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. చిరంజీవి తొలిసారిగా ఒక పేట్రియాటిక్ నేపథ్యం ఉన్న కథలో నటిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఇక ట్రైలర్ లో అదిరిపోయే విజువల్స్, యాక్షన్ సీన్స్, భారీ రేంజ్ సెట్టింగ్స్, ఫైట్ సీన్స్ వంటివి పొదుపరచడంతో ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి సినిమా ఎంత గ్రాండియర్ గా ఉండబోతుందో అర్ధమయింది. అప్పట్లో యూట్యూబ్ లో ఈ ట్రైలర్ అత్యధిక వ్యూస్ ని అందుకుని దూసుకుపోయింది. 

ఇక ఆ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు, అభిమానులు అనుకున్న అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ, సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాలు, నరసింహారెడ్డిగా మెగాస్టార్ సహజత్వ నటన అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఒకరకంగా చిరంజీవి కెరీర్ లో ఎంతో భారీ వ్యయంతో రూపొందిన సైరా నరసింహారెడ్డి, ఆ తరువాత నుండి తెలుగులో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల రాకకు మరింత బలాన్నిచ్చింది అని చెప్పవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: