ఆ దర్శకుడి భవిష్యత్తు పవన్ సినిమాతో ముడిపడి ఉందా....??

GVK Writings

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుండి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు ఎందరో దర్శకులు పరిచయం అయ్యారు. ఆ విధంగా వచ్చిన వారిలో చాలామంది ప్రస్తుతం అగ్ర దర్శకులుగా కొనసాగుతుండగా, కొందరు మాత్రం మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఆయన బ్యానర్ పై ముందుగా సిద్దార్ధ, శృతి హాసన్ ల కలయికలో తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమా ద్వారా పరిచయమైన యువ దర్శకుడు వేణు శ్రీరామ్. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. 

ఆపై నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ సినిమా తీసిన వేణు, ఆ సినిమాతో మొత్తానికి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. దాని అనంతరం చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం ఏకంగా పవర్ స్టార్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న వేణు శ్రీరామ్, ఆ సినిమాపై భారీ స్థాయిలు నమ్మకాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎంసీఏ మంచి సక్సెస్ కొట్టినప్పటికీ కూడా, ఎలాగైనా తదుపరి సినిమా మరింత హిట్ కావాలని మూడేళ్లు గ్యాప్ తీసుకున్న వేణు శ్రీరామ్, ఎట్టకేలకు వకీల్ సాబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన పింక్ అనే కోర్ట్ డ్రామా మూవీ అధికారిక రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 

అయితే కథ విషయమై హిందీ నుండి మూల పాయింట్ మాత్రమే తీసుకుని, దానిని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసిన వేణు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాని ఎంతో కసితో తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమా మంచి సక్సెస్ అయితే, తదుపరి అల్లు అర్జున్ తో చేయబోయే ఐకాన్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ మరింత త్వరగా వస్తుందని వేణు శ్రీరామ్ భావిస్తున్నాడట. మరి అతడి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో తెలియాలి అంటే మాత్రం వకీల్ సాబ్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ విధంగా దర్శకుడు వేణు శ్రీరామ్ భవిష్యత్తు పవన్, వకీల్ సాబ్ ఫలితం పై ఆధారపడి ఉందని తెలుస్తోంది...!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: