త్రివిక్రమ్ మార్క్ పంచెస్ కి..... బన్నీ మార్క్ కామెడీ టైమింగ్, నిజంగా అదుర్స్....!!
టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. కాగా వాటిలో జులాయి, అలవైకుంఠపురములో సినిమాలు సూపర్ హిట్ కొట్టగా, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మాత్రం కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే దక్కించుకుంది. ముందుగా వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి సినిమాలో త్రివిక్రమ్ మార్క్ పంచెస్ కి బన్నీ స్టైల్ కామెడీ డైలాగ్స్, కామెడీ సీన్స్ నిజంగా అదుర్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో బన్నీ నటించిన సీన్స్ అయితే మరింతగా అలరిస్తాయి.
అనంతరం వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాలో కూడా బన్నీ తన కామెడీ పంచెస్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం, బన్నీ అలానే ఆలీ, బన్నీ కాంబినేషన్ కామెడీ సీన్స్ అయితే మనల్ని మరింతగా కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ తరువాత బన్నీ, త్రివిక్రమ్ ల కలయికలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అలవైకుంఠపురములో. ఇక ఈ సినిమాలో అయితే బన్నీ తన మార్క్ కామెడీ టైమింగ్ తో సినిమాలో చాలా సన్నివేశాల్లో అదరగొట్టాడు.
ముఖ్యంగా తండ్రి మురళిశర్మ, అలానే ఆఫీస్ లో రాహుల్ రామకృష్ణ, మధ్యలో కొన్ని సీన్స్ లో హీరోయిన్ పూజ హెగ్డే తో బన్నీ కాంబినేషన్ డైలాగ్స్, సీన్స్ నిజంగా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తాయి. ఎంటర్టైనింగ్ వేలో సాగె త్రివిక్రమ్ పంచెస్ ని, బన్నీ తన మార్క్ కామెడీ స్టైల్ లో ఆద్యంతం ఈ సినిమాలో అదరగొట్టే పెర్ఫార్మన్స్ చేసాడనే చెప్పాలి. బన్నీ ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకులు సైతం ఈ సినిమా డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం విశేషం. ఆ విధంగా బన్నీ, త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కిన ఈ మూడు సినిమాలు కూడా మంచి ఎంటర్టైనింగ్ వేలో సాగుతూ ప్రేక్షకులను అలరించాయని చెప్పవచ్చు.....!!