కోలీవుడ్ లో నయా లవ్ స్టోరీ.. ప్రైవేట్ పార్టీకి పిలిచి షాక్ ఇచ్చిన యువ హీరో..!

shami

తెలుగు, తమిళ భాషల్లో నైన్టీస్ లో సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి. డైరక్టర్ గా ఆయన చేసిన సినిమాలు తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇక ఆయన దర్శకుడిగా రిటైర్మెంట్ ఇచ్చి తనయులను రంగంలోకి దించాడు. అందులో చిన్నోడి ఆది పినిశెట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకోగా.. పెద్దోడు సత్య ప్రభాస్ డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆది పినిశెట్టి తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. హీరోగానే కాదు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా చేస్తున్నాడు. ప్రస్తుతం సోలో స్టేటస్ లో ఉన్న ఆది పినిశెట్టి తన సోల్ మెట్ ను వెతుక్కున్నాడని కోలీవుడ్ టాక్. 

కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం హీరోయిన్ నిక్కి గర్లానితో ఆది పినిశెట్టి పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని తెలుస్తుంది. ఆది, నిక్కి కలిసి 2017లో మరకతమణి సినిమాలో నటించారు. అప్పటినుండి వీరి మధ్య రిలేషన్ కొనసాగుతుందట. మొదట స్నేహితులుగా ఉన్నా ఇప్పుడు ఇద్దరు డీప్ లవ్ లో ఉన్నారని టాక్. ఎక్కడపడితే అక్కడ జంటగా కనిపించడమే కాకుండా రీసెంట్ గా రవిరాజా పినిశెట్టి బర్త్ డే పార్టీలో పినిశెట్టి ఫ్యామిలీతో ఆమె దర్శనమిచ్చింది. కేవలం ఫ్యామిలీ మాత్రమే అటెండ్ అయిన ఆ పార్టీకి తన ప్రేయసిని తీసుకొచ్చి వాళ్ల లవ్ ను కన్ఫాం చేశాడు ఆది పినిశెట్టి.

తెలుగులో ఒకటి రెండు సినిమాలనే చేసిన నిక్కి గర్లాని. తమిళ, కన్నడ భాషల్లో దూసుకెళ్తుంది. ఆది, నిక్కి కోలీవుడ్ లో ఈ స్టార్ లవ్ స్టోరీ గురించి న్యూస్ వైరల్ గా మారుతుంది. అయితే వీళ్లిద్దరి మధ్య నడిచే లవ్ స్టోరీ గురించి వారు మాత్రం చాలా సైలెంట్ గా ఉంటున్నారు. మీడియా వార్తలను పెద్దగా పట్టించుకోని వీరు ఏదోఒకరోజు సడెన్ గా పెళ్లితో సర్ ప్రైజ్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: