మతిమరుపు పాత్ర‌లో నాని కామెడీకి పొట్ట‌చెక్క‌ల‌వ్వాల్సిందే!!

Kavya Nekkanti

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `భలే భలే మగాడివోయ్`. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించిన ఈ  చిత్రాన్ని  గీతా ఆర్ట్స్2, యు.వీ.క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో వంశి కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, బన్నీ వాసు నిర్మించారు. ఎప్పటినుండో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాని ఈ సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు.  2015లో విడుదలైన ఈ చిత్రం హిట్ అవ్వ‌డంతో పాటు మంచి క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్టింది.

లక్కీ (నాని) మొక్కలపై పరిశోధన చేసే అధ్యయన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తుంటాడు. అంత వరకు బాగానే ఉంది. అయితే లక్కీకి మతిమరపు అనే పెద్ద లోపం ఉంటుంది.  ఏ పని చేసిన వెంటనే మార్చిపోతాడు..అలాంటి లక్కి, నందన (లావణ్య త్రిపాఠి) మొదటి చూపులోనే ప్రేమలో పడేస్తాడు. కాని, ల‌క్కీకి ఉన్న మ‌తిమ‌రుపు వ‌ల్ల.. పెళ్లికి పెద్ద‌ సమస్యగా మారుతుంది. అయితే అతడు తన మతిమరుపుని కప్పిపుచుకోవటానికి చేసే పనులు, తన ప్రేమించే అమ్మాయిని చివరికి ఎలా సాధించుకుండానేదే ఈ చిత్ర కథ. 

ఈ చిత్రంలో నాని ఒక మతి మరుపు వ్యక్తిగా అద్భుతమైన నటనను కనపరిచాడు. అలాగే ఈ సినిమాలో నాని చేసే కామెడీకి ప్రేక్ష‌కులు పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వుకున్నార‌ని చెప్పాలి. అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఎలా నవ్వించాడో.. అదే కామెడీ టైమింగ్‌ను నాని కూడా ఫాలో అయ్యి హిట్ కొట్టాడు. బూతూ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతీ కూడా ఈ చిత్రం ద్వారా మంచి పేరు వ‌చ్చింది. ఇక‌ ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 700 సెంటర్లలో విడుదలయి, 55 కోట్ల గ్రాస్ తో పెట్టిన పెట్టుబడికి మూడింతలు వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: