చెప్పేవాళ్లు లేక ప్రభాస్ ఇలా అవుతున్నాడా.. ?

NAGARJUNA NAKKA

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మారేవాడేమో. బ్రహ్మచారిగా ఉండిపోవడం వలనే ఇలా ఉన్నాడా..? ఇంతకీ ప్రభాస్ పెళ్లికి.. మారిపోవడానికి సంబంధం ఏంటనేగా.? బాహుబలితో ఆలిండియా హీరో అయిన ప్రభాస్ కు చెప్పేవాళ్లు.. అదుపులో పెట్టేవారు లేకపోవడం వలనే.. ఇష్టం వచ్చినట్టు తయారవుతున్నాడట.

 

తెలుగులో ఏ హీరోకూ రాని ఇమేజ్ బాహుబలితో ప్రభాస్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్. బాహుబలి 2తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని నటించిన సాహో తెలుగులో డిజాస్టర్ అయినా.. హిందీలో పెట్టుబడి రాబట్టింది. అయితే హిందీలో తనకున్న ఇమేజ్ ను ఉపయోగించుకోలేకోపోతున్నాడు ప్రభాస్. 

 

సాహో సినిమాకు ప్రభాస్ లుక్ మైనస్ అయింది. ఆరడుగుల పైన ఉన్నా.. సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నా ఏం లాభం అన్నట్టు ఉంది ప్రభాస్ వ్యవహారం. బాహుబలితో పోల్చుకుంటే.. ఫేస్ చాలా ఛేంజ్ వచ్చేసింది. ఒక్కసారిగా ముదిరిపోయింది. వయసుతో పాటు ఫేస్ లో ఛేంజెస్ రావడం కామనే అయినా.. మరీ ఇలా కొట్టొచ్చినట్టు కనిపిస్తే ఎలా అంటూ ఫ్యాన్సే కామెంట్ చేస్తున్నారు. 

 

సాహో సినిమాలో ప్రభాస్ లుక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. మహేశ్ ప్రభాస్ కంటే నాలుగేళ్లు పెద్దవాడైనా.. ఇప్పటికీ హ్యాండ్సమ్ లుక్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం.. ఫేస్ లో తగ్గిపోతున్న గ్లోను పట్టించుకోవడం లేదని.. ఇంత ముదురుగా కనిపిస్తే ఎలా అంటూ.. ఇండస్ట్రీలో సైతం బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యామ్ పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. లవర్ బాయ్ గా కనిపించాల్సి ఉంది. కానీ సాహోతో పోల్చుకుంటే.. ఫేస్ లో మార్పేమీ కనిపించలేదు. 

 

మొహంలో కళ తప్పుతోందని ఫ్యాన్స్ తో పాటు అందరూ మొత్తుకుంటున్నా.. హీరో చెవికి ఎక్కడం లేదు. ఇదే కంటిన్యూ అయితే.. ప్రభాస్ కూడా సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి పక్కన చేరిపోయే ప్రమాదముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: