అమ్మ చేతి కాఫీ అన్ని ప్రాబ్లెమ్స్ సాల్వ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన మదర్ ఇందిరా దేవి ఇచ్చే కాఫీ గురించి రెండు మూడు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఎప్పుడైనా తన తల్లి దగ్గరకు వెళ్లినప్పుడు కచ్చితంగా ఓ కాఫీ తాగుతానని.. అమ్మ కాఫీ ఇస్తే అప్పటివరకు ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా తగ్గుతుందని అన్నారు మహేష్. మహేష్ తల్లి ఇందిరా దేవి అంటే చాలా ఇష్టం. ఈమధ్య ఓ సినిమా రిలీజ్ ముందు కూడా అమ్మ చేతి కాఫీ తాగాను కచ్చితంగా సినిమా హిట్టు కొడతానని చెప్పి మరి సినిమా హిట్ అందుకున్నాడు మహేష్.
విజయ నిర్మలతో కృష్ణ మ్యారేజ్ తర్వాత ఇందిరా దేవి వేరుగా ఉంటున్నా తనకు అమ్మని చూడాలని అనిపించినప్పుడల్లా ఆమె వద్దకు వెళ్లేవాడట మహేష్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే తల్లి బాగోగులు అడిగి తెలుసుకుంటాడు మహేష్. మదర్ తో తనకున్న ఎటాచ్ మెంట్ మాటల్లో చెప్పలేనిదని అంటున్నాడు మన సూపర్ స్టార్. అంతేకాదు తన పాప సితార అచ్చం మా అమ్మాలానే ఉంటుందని మురిసిపోతుంటాడు. ఇందిరా దేవి ఎక్కడకైనా వెళ్లాలన్నా సరే మహేష్ ను తోడుగా తీసుకోని వెళ్తారని తెలుస్తుంది. అమ్మ దగ్గర నుండి ఫోన్ రావడమే ఆలస్యం మహేష్ తన పనులన్ని మానుకుని ఆమె కోసం వెళ్తారట.
స్క్రీన్ మీద సూపర్ స్టార్ అయినా కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా మహేష్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు. కృష్ణకు దూరంగా ఉంటున్నా రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. విజయ నిర్మల మరణం తర్వాత తండ్రికి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ప్రతిరోజూ ఫోన్ లో మాట్లాడుతున్నారని తెలుస్తుంది. మహేష్ సోదరి మంజుల ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు చేసింది. మహేష్ నటించిన నాని సినిమా ఆ బ్యానర్ లోనే తెరకెక్కింది.