ఛ .....  ఒక్క ఛాన్స్ కోసం ఇద్దరూ అంతలా రచ్చ చేయాలా.....??

GVK Writings

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని మన పెద్దలు చెప్పిన విధంగా ప్రస్తుతం టాలీవుడ్ లోని ఇద్దరు భామలు ప్రస్తుతం వస్తున్న సినిమా అవకాశాలు అన్నీ తమ ఖాతాలోనే వేసుకోవాలని చూస్తున్నారట. ఇప్పుడే తమకు అవకాశం అని, కాలం ముందుకు సాగే కొద్దీ మెల్లగా అవకాశాలు సన్నగిల్లి, ఆపై అవి మరొకరిని వరిస్తాయంటూ సూక్తులు కూడా బోధిస్తున్నారట. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్స్ గా కొనసాగుతున్న ఇద్దరు భామలు, అతి త్వరలో తెరకెక్కనున్న ఒక స్టార్ హీరో సినిమా అవకాశం విషయమై లోలోపల కొంత యుద్ధం చేస్తున్నట్లు టాక్. 

ముందుగా ఒక స్టార్ హీరో సినిమా కథని ఇటీవల ఒక హీరోయిన్ కి చెప్పిన దర్శకుడు, ఆమె కొంత సమయం కావాలి అనడంతో సరే అని ఆగాడట, అయితే మధ్యలో ఆ అవకాశం మరొక హీరోయిన్ ని వరించిందని తెలుసుకున్న మొదటి హీరోయిన్, సదరు దర్శకుడు, అలానే అవకాశం అందుకున్న హీరోయిన్ పై విరుచుకుపడడం మొదలెట్టిందట. ముందుగా తనను సంప్రదించిన దర్శకుడు, నేను అడిగిన విధంగా సమయం ఇవ్వాలి కదా, అయినా ఒకరికి కథ చెప్పి, మధ్యలో సడన్ గా ఆ అవకాశాన్ని వేరొకరికి ఎలా ఇస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. అంతటితో ఆగని సదరు భామ, ఆ అవకాశం దక్కించున్న హీరోయిన్ పై విరుచుకుపడుతూ కామెంట్స్ కూడా చేసిందట. అసలు ఒక సినిమా అవకాశం అంగీకరించేముందు, ఆ పాత్రను ఇదివరకు ఎవరికైనా చెప్పారా అనే విషయం కనుక్కోకుండానే ఓకే చేసేస్తారా అంటూ మండిపడుతోందట. 

 

అయితే ఈ విషయమై అవకాశం అందుకున్న హీరోయిన్ కూడా ఊరుకోకుండా, తనకు అదృష్టం కలిసి రావడంతోనే, ఆ హీరోయిన్ తన మీద మండిపడుతోందని, అయినా నేను ఎవరి అవకాశాన్ని కూడా బలవంతంగా లాక్కోలేదు, నావద్దకు వచ్చిన ఛాన్స్ ని దక్కించుకున్నాను అంతే అంటూ సమాధానమిస్తోందట. ఈ విధంగా కేవలం ఒక సినిమా ఛాన్స్ మిస్ అయిందని, పేరున్న ఆ హీరోయిన్లు ఇద్దరూ వాదనకు దిగడం, ఆ విషయం టాలీవుడ్ లోని కొందరు సినిమా ప్రముఖుల చెవిన పడడంతో, ఛ.. అయినా ఆ ఒక్క ఛాన్స్ కోసం ఇద్దరూ కూడా అంతలా రచ్చ చేయాలా అంటూ వారిలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరై ఉంటారా అనేదాని పై టాలీవుడ్ సహా పలువురు ప్రేక్షకుల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చ జరుగుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: