బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్..!

shami

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరక్షన్ లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2021 లో రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవల్ లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. యూనివర్సల్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఆల్రెడీ పూర్తైనట్టు తెలుస్తుంది. ఈరోజు 11 గంటలకు ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వస్తుందని చిత్రయూనిట్ ఎనౌన్స్ చేశారు.

 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం ముగ్గురు టాప్ బాలీవుడ్ భామలను అడిగినట్టు తెలుస్తుంది. ప్రభాస్ సరసన నటించేందుకు దీపికా పదుకొనె, కియరా అద్వాని, కత్రినా కైఫ్ ఈ ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. దీపికా కోసం ప్రయత్నిస్తున్నా ఆమె భారీ రెమ్యునరేషన్ అడుగుతుందని వెనక్కి తగ్గుతున్నారు. ఇక తెలుగులో ఆల్రెడీ రెండు సినిమాలు చేయడమే కాకుండా బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న కియరా అద్వాని అయితే బాగానే ఉంటుందని అంటున్నారు.

 

ఇక కత్రినా కైఫ్ అయినా సరే సినిమాకు క్రేజ్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. దీపికా, కియరా ఇద్దరు కాదంటే మూడవ ఆప్షన్ గా కత్రినా దగ్గరకు వస్తారని తెలుస్తుంది. కత్రినా కూడా తెలుగులో వెకటేష్, బాలకృష్ణ సినిమాల్లో నటించి మెప్పించింది. మొత్తానికి బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్ కు సిద్ధమయ్యాడు. మహానటితో సత్తా చాటిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.                                      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: