అసలు మీకు బుద్ధి ఉందా ......ఆ పిచ్చి రాతలు ఇక ఆపరా .....??
ఒకప్పటితో పోలిస్తే ఇటీవల కాలంలో ఎన్నో మీడియా ఛానల్స్ రంగప్రవేశంతో పాటు యూట్యూబ్ వంటి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎన్నో న్యూస్ ఛానల్స్, పోర్టల్స్ వెలుస్తున్నాయి. వాటిలో కొందరు జెన్యూన్ న్యూస్ వేస్తుంటే, మరికొందరు మాత్రం తమకు తోచిన విధంగా రేటింగ్స్, వ్యూస్ కోసం తప్పుగా వార్తలు ప్రచారం చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారనేది అందరూ ఒప్పుకుని తీరవలసిన వాస్తవం. అయితే అటువంటి తప్పుడు ప్రచారాల వలన సామాన్య ప్రజల కంటే సెలెబ్రిటీలకే పెద్ద సమస్య తలెత్తుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, కొన్నేళ్ల క్రితం ఒక స్టార్ హీరో సినిమా ద్వారా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన యువ నటి, ఆ తరువాత మెల్లగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో వరుసగా అవకాశాలు అందుకుని ముందుకు సాగింది.
అనంతరం అనుకోకుండా ఒక సీనియర్ డైరెక్టర్ తీసిన సినిమాతో పెద్ద హిట్ కొట్టి, నటిగా ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్న సదరు హీరోయిన్, ఆ తరువాత నుండి అటు తెలుగు, ఇటు తమిళ సహా పలు భారీ చిత్రాల్లో అవకాశాలతో ముందుకు సాగింది. కొన్నాళ్ల క్రితం ఒక బడా మూవీతో అత్యద్భుత విజయాన్ని, క్రేజ్ ని సొంతం చేస్తున్న ఆ హీరోయిన్, ఇటీవల మాత్రం కొంత ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ విధిగా ముందుకు సాగుతున్న సదరు హీరోయిన్ వివాహానికి సంబంధించి ఇటీవల కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఒకానొక సమయంలో ఒక స్టార్ హీరోతో ఆమె పెళ్లి అంటూ పుకార్లు కూడా ప్రచారం అయ్యాయి. అయితే అవన్నీ నిజం కాదు అంటూ ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు.
అయినప్పటికీ కూడా ఆమె పెళ్ళికి సంబంధించి ఇప్పటికీ పలు పుకార్లు వస్తుండడంతో, ఎట్టకేలకు వాటితో విసిగిపోయిన ఆమె, ఇటీవల తన సన్నిహితుల వద్ద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిందట. అలానే తనకు తెలిసిన ఒక పాత్రికేయ మిత్రునితో మాట్లాడుతూ, అసలు మీకు బుద్ధి ఉందా, నా పెళ్లి గురించి మీ పిచ్చి రాతలు ఇక అపరా అంటూ ప్రశ్నించిందట. ఇకనైనా అటువంటి తప్పుడు రాతలు అపి వాస్తవాలు మాత్రమే రాస్తే బాగుంటుందని, అలా అని తాను అందరినీ అనడం లేదని, కేవలం కొందరు మాత్రమే తమ స్వలాభం కోసం తమవంటి వారి మీద ఈ విధంగా లేనిపోని తప్పుడు వార్తలు పదే పదే రాస్తూ ప్రచారం చేస్తున్నారని, కాబట్టి వీటికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని కోరిందట. కాగా ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరై ఉంటారా అంటూ అటు టాలీవుడ్ వర్గాలతో పాటు, ఇటు ప్రేక్షకులు కూడా అప్పుడే చర్చించుకోవడం మొదలెట్టేశారు ......!!